సాధారణంగా మనం మనకొచ్చిన ఆరోగ్య సమస్యను బట్టి , మనం టాబ్లెట్లను తెచ్చుకోవడం ,వాటిని వేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడూ మనం టాబ్లెట్ సీట్ వెనుక ఉండే రంగులు.. ఒక్కో సీటుకు ఒక్కో రంగు లైన్లు ఉంటాయి ఎందుకు..?  అని ఏ రోజు కూడా గమనించి ఉండము. సాధారణంగా కొంతమంది మాత్రం వీటివల్ల కూడా ఏదో ఒక ఉపయోగం అయితే ఉంటుందని అనుకుంటుంటారు. కానీ మనలో కొంతమంది ఏమనుకుంటారంటే ఈ షీట్ చూడడానికి కలర్ఫుల్ గా ఉండడం  కోసం మాత్రమే  వెనుకల లైన్లు వేయడం జరుగుతుంది అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు.

కానీ నిజానికి ప్రతి ఒక్క గుర్తుకు లేదా రంగుకి ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం ఉంటుంది అని మాత్రం మనం గ్రహించాలి. ఈ టాబ్లెట్ షీట్ వెనుక ఉండే రంగు రంగుల లైన్లు ఎందుకు వేస్తారో అనే విషయం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఈ షీట్ వెనుక భాగంలో ఎరుపు రంగు , నీలం రంగు లాంటి రంగుల లైన్ లు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం.

1. ఎరుపు రంగు గీత:
టాబ్లెట్ వెనుక భాగంలో కొన్ని టాబ్లెట్ షీట్ లకు మాత్రమే ఎరుపు రంగు గీతలు ఉంటాయి. ఈ ఎరుపు రంగు గీత గలిగిన టాబ్లెట్లను మనం యాంటీబయాటిక్ టాబ్లెట్స్ గా గుర్తించవచ్చు. అయితే ఈ యాంటీబయటిక్ ట్యాబ్లెట్ లని ఎక్కువగా వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఆర్ ఎక్స్ అనే సింబల్ ని కూడా మనం గమనించవచ్చు. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకుని, ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిది.

2. నీలి రంగు గీతలు:
టాబ్లెట్ వెనుకల నీలి రంగు గీతలు గనుక ఉన్నట్లయితే,ఇవి  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కానే, ఆరోగ్యానికి హాని కాని కలుగజేయవు. వీటిని డాక్టర్ సలహా లేకున్నా సరే మనం తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు పారాసిటమాల్ వంటి మాత్రలు.

అంతేకాదు టాబ్లెట్ షీట్ వెనుక భాగంలో ఆ టాబ్లెట్ లను ఏ కంపెనీ తయారు చేసింది..? ఎప్పుడు తయారు చేసింది ..? ఎక్కడ తయారు చేసింది ..? అనే విషయాలను కూడా స్పష్టంగా అందించడంతో పాటు ఆ టాబ్లెట్ లో ఉన్న పోషక విలువలు కూడా మనకు లిఖిత పూర్వకంగా అందించడం జరుగుతుంది. కాబట్టి  ఇకపై ఎప్పుడైనా మీరు టాబ్లెట్ వేసుకునేటప్పుడు, ఒకసారి టాబ్లెట్ షీట్ వెనక్కి తిప్పి ఏముందో ఒకసారి చదివి మరీ వేసుకోవడం ఉత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి: