ఇక అక్కడే లోకల్ బొటీక్‌లో సేల్స్ మోడల్ పొజిషక్‌కి అప్లై చేసింది.అప్లై చేసుకున్న తరువాత తనని ఇంటర్వ్యూకి పిలుస్తూ మెయిల్ వస్తుందని ఆమె భావించడం జరిగింది. కానీ దానికి బదులుగా ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నుంచి ఓ యాక్సిడెంటల్ మెయిల్ ఆమెకు వచ్చింది.ఆ మెయిల్ లో ఆమె మరీ అంత అందంగా లేదని అతడు చెప్పడం గ్రేసీకి చాలా కోపాన్ని కలిగించింది.దాంతో ఆమె కోపాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.ఇక ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను అవా లేన్ అనే కంపెనీలో బ్రాండ్ రిప్రజెంటేటివ్ గా పని చేసేందుకు అప్లై చేశాను. ఇక ఆ కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్ (అంటే ఆత్మవిశ్వాసంతోనే అందం). కానీ అలాంటి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నుంచి నాకు అనుకోకుండా ఓ మెయిల్ వచ్చింది. నేను అందంగా లేను అని ఆ మెయిల్ లో వెల్లడించారు’ అని వివరించింది గ్రేసీ.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి