ఏ శుభ కార్యానికైనా లేదా  ప్రియుడు తన ప్రేయసి ని కలిసే ముందైనా, లేదా స్నేహితుడిని కలిసినప్పుడు అయినా తప్పకుండా ఈ క్యాడ్బరీ ను ఇవ్వడం ఆనవాయితీ. ఎందుకంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫ్యాషన్ ని అలవాటు చేసుకున్నారు ఈ కాలం యువత. ఇక అందులో భాగంగానే , ఎవరిని కలిసినా సరే ముందుగా క్యాడ్బరీ చాక్లెట్లు ఇచ్చి వారిని సంతోషపరచి , ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఈ క్యాడ్బరీ చాక్లెట్లు ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు కేవలం మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాలలో ఈ చాక్లెట్ ను అమ్మడం జరుగుతుంది.

అలాంటి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్,  ప్రస్తుతం బ్యాన్ చేయాలనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ క్యాడ్బరీ చాక్లెట్ కు సంబంధించిన ఒక పోస్టరు సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతోంది. ఈ క్యాడ్బరీ చాక్లెట్ ను తయారు చేసేటప్పుడు గొడ్డు మాంసాన్ని కలుపుతున్నారని, భారత దేశంలో హిందువులు చాలామంది ఉన్నారని  హిందువులు ఇలాంటి మాంసాన్ని తినడానికి అసలు ఒప్పుకోరని  ఇక ఇలాంటి చాక్లెట్లను ఎలా మీరు అమ్ముతున్నారని , వెంటనే నిలిపివేయాలని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.


అయితే దీనికి స్పందించిన క్యాడ్బరీ కంపెనీ.. తమ ఉత్పత్తులలో ఇలాంటి గొడ్డు మాంసాన్ని , జెలిటిన్ రూపంలో కలవడం లేదు అని, అది ఆస్ట్రేలియాకు సంబంధించిందని, భారత దేశములో పూర్తిగా శాకాహారంతో మాత్రమే, తయారుచేసిన క్యాడ్బరీ చాక్లెట్ లను అమ్మకానికి పెడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అంతే కాదు ఎవరో తమ సంస్థ ఎదగడం ఇష్టం లేక ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని కూడా ఆ సంస్థ వాపోయింది.

ఇక ఇలాంటి నెగిటివ్ పోస్టులు రావడం వల్ల క్యాడ్బరీ ఇమేజ్ దెబ్బతింటుందని, అంతేకాదు తమ కస్టమర్ల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని, క్యాడ్బరీ ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు వాటిని 100% శాకాహారంతో నే, తయారు చేసి మరీ ధృవీకరించబడింది.. అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇలాంటి వార్తలను మరొకసారి చేయవద్దు అంటూ కూడా హెచ్చరిస్తోంది క్యాడ్బరీ సంస్థ.


మరింత సమాచారం తెలుసుకోండి: