సాధారణంగా ప్రేమలో ఉన్న వారు తమ ప్రేయసి తన మనసులో మాటను చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. సరైన సమయం వస్తే చాలు ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో రెగ్యులర్ గా కాకుండా ఎంతో కొత్తగా.. ఎవరూ ఊహించని విధంగా ప్రియురాలికి  ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎంతో మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది ఏకంగా క్రికెట్ స్టేడియం లో ప్రపోజ్ చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఇక ప్రేక్షకులు అందరూ ఎంతో సీరియస్గా మ్యాచ్ వీక్షిస్తున్న టైం లో ఏకంగా ఒక రింగ్ పట్టుకుని వచ్చి ఇక అక్కడ స్టేడియం లో కూర్చుని మ్యాచ్ ఆతృతగా ప్రేయసి వద్దకు వచ్చి ఇక మోకాళ్ళపై కూర్చుని ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు ఇచ్చిన సర్ప్రైస్ తో ప్రియురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.



 ప్రస్తుతం ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ లో భాగంగా ఇటీవలే 3వ టి20 మ్యాచ్ ఆడింది. పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఓ వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఇక అతని ప్రపోజల్ తో ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆ యువతి  అంతేకాదు కన్నీళ్ళు కూడా పెట్టుకుంది. చివరికి అతని ప్రపోజల్కు ఎస్ చెప్పేసింది. అతని నుంచి ఉంగరం తీసుకుని అతనికి ముద్దు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: