మీరు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు..  ఇంతలో ఎదురుగా ఒక నాగుపాము కనిపించింది.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది  పామును చూడగానే ఒక్కసారిగా గుండెలు జారిపోయినంత పని అవుతుంది. ధైర్యవంతులు అయితే అక్కడే నిలబడి ఒక నాగుపాము వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అదే కాస్త పిరికివారు అయితే ఈ నాగు పామును  చూడగానే అక్కడి నుంచి పారిపోతారు. ఇలా ఎక్కడో దూరంగా నాగుపాము కనిపిస్తేనే హడలి పోతే .. అదే మనకు దగ్గరగా నాగ పాము కనిపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది.


 ఒక్క సారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి అనుభవమే ఎదురైంది. నాగుపాము ఆ వ్యక్తి ఉంటున్న ఇంటి ఆవరణలో కి రావడమో లేదా.. ఇంట్లోకి రావాటమో జరగలేదు ఏకంగా ఆ వ్యక్తి షూస్ లోకి వచ్చింది. పొరపాటున ఆ వ్యక్తి షూ చూడకుండా వేసుకుని ఉంటే  ఎంత పని జరిపోయేదో. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇంతకీ వీడియో లో ఏముంది అంటారా.. ఏకంగా ఒక వ్యక్తి షూస్ లో నాగుపాము దాగి ఉంది. ఆ షూ కదిలించగానే  పడగవిప్పి బుస కొడుతూ బయటకు వచ్చింది.



 మళ్లీ ఆ పాము లోపలికి వెళ్లి దాక్కుంది.  ఇక ఈ వీడియో చూసి అందరూ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో అందరిలో మరింత జాగ్రత్త పెంచుతుంది. ఎందుకంటే చాలామంది షూస్ ఇలాగే క్లీన్ చేయకుండా వేసుకుంటూ ఉంటారు. లోపల ఏముంది అనే విషయాన్ని కూడా గ్రహించరు.  ఇలా వేసుకుంటే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో అనే విషయాన్ని ఈ వీడియో చెప్పకనే చెబుతుంది. అయితే ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు భలే ఉంది బుజ్జిముండ అంటూ ఏకంగా ఒక క్యాప్షన్ కూడా ఇవ్వడం అందరిని మరింత ఆకర్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: