సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న చిత్ర విచిత్రాలకు మానవుని మెదడు గిర్రున తిరిగిపోతోంది. అసలు మనము ఏ కాలంలో ఉన్నాము అని ఆశ్చర్య పడేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా అవాక్కవుతారు. అసలు ఏమి జరిగింధో ఒకసారి చూద్దామా. అక్కడ శుభమా అని పచ్చని పెళ్లి పందిట్లో బంధువులు, అతిథులు అందరి నడుమ ఒక చూడముచ్చటైన జంట మూడు ముళ్ళ సాక్షిగా భార్యా భర్తలుగా మారిపోయారు. అందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతలో హఠాత్తుగా జరిగిన ఒక పరిణామానికి పెళ్లి పందిట్లో ఉన్న వారంతా షాక్ అయ్యారు.

అదేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అంతలా ఏమి జరిగిందా అనుకుంటున్నారా ? కట్ చేస్తే పెళ్లి చేసుకున్న వధువు ఇంతకు ముందే కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయిని ఎంతో గాఢంగా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నారు. కానీ ఎప్పటి లాగే వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తద్వారా తమ ప్రేమను పెద్దల గౌరవం కోసం త్యాగం చేశారు. కానీ ఆ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతోందని తెలుసుకుని అక్కడికి చేరుకుంటాడు. కానీ అతను వచ్చేటప్పటికీ పెళ్లి కాస్తా జరిగిపోయి ఉంటుంది.

ఏ ప్రేమికుడైనా తను ప్రేమించిన అమ్మాయిని వేరొకరు పెళ్లి చేసుకుంటే చూసి తట్టుకోవటం చాలా కష్టం. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఆ మాజీ లవర్ చేయడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అక్కడికి వచ్చిన ఆ యువకుడు చాలా సంతోషంగా ఎంతో బాధను దిగమింగుకుని తన లవర్ హస్బెండ్ కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి హగ్ చేసుకున్నాడు. కానీ పెళ్లి కూతురి వైపు కోపంగానే చూస్తున్నాడు. అతనిని అలా చూసిన వధువు సైతం తల క్రిందకు దించుకుని బాధలో మునిగిపోయింది. అలా ఆ యువకుడు ఎంతో బాధతో నిండిన హృదయంతో పెళ్లి మండపాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది చుసిన నెటిజన్లు ఆ బ్బాయికి సపోర్ట్ గా కామెంట్స్ పెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: