ఇక సాధారణంగా ట్రాఫిక్‌ పోలీసుల్ని చూడగానే వాహనదారులు అందరూ కూడా అలెర్ట్‌ అవుతుంటారు.. వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలు ఉన్నాయంటే..సరే లేదంటే, చలానా కట్టక తప్పదు. అందుకనే చాలా మంది ఏవేవో ట్రిక్స్‌ ప్లే చేస్తూ.. ట్రాఫిక్‌ పోలీసుల బారి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలని చూస్తుంటారు. అయితే ఇక్కడో యువతి మాత్రం ట్రాఫిక్ పోలీస్ కి లంచమిస్తూ అడ్డంగా దొరికింది.ఇక ఇందులో కొత్తముంది. మామూలేగా, అని అనుకుంటున్నారా..? అయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ యువతీ లంచంగా ఇచ్చింది డబ్బు కాదు.. అది ముద్దు. బాబోయ్‌ ఆ అమ్మాయి ఆ ట్రాఫిక్ పోలీస్ కి ముద్దు లంచంగా పెట్టిందా..? ఇదే కదా మీ డౌట్ .. అవును అందుకే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఓ యువతి తప్పు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెని పట్టుకోవడం జరిగింది. అయితే ఆమె ఎంత బతిమాలినా కూడా ఆమె మాట అసలు వినలేదు ట్రాఫిక్‌ పోలీస్‌. ఇక అతనికి లంచం ఇవ్వడానికి కూడా ఆమె ప్రయత్నించడం జరిగింది. ఇక అందుకు కూడా ఆ పోలీస్ ససేమిరా అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఆ యువతిని ట్రాఫిక్ పోలీస్ వదిలేలా కనిపించలేదు. అయితే ఆమె పోలీసు నుండి ఎలాగైనా తప్పించుకొని బయటపడాలని అనుకుంది. దీంతో నడిరోడ్డుపైనే .. అందరు చూస్తుండగానే ఆ ట్రాఫిక్ పోలీస్ కి ఏకంగా ముద్దు పెట్టేయడం జరిగింది. ఇక ఈ షాకింగ్ ఘటనతో అక్కడున్న వాహనదారులు ఇంకా ప్రయాణికులు అంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి ఎంతకి తెగించిందంటూ ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇది చూసిన నెటిజన్లంతా ఆ యువతి చేసిన పనికి..రకరకాలుగా తిడుతూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇక కింద వున్న లింక్ ఓపెన్ చేసి మీరు చూసేయండి.https://www.instagram.com/reel/CS6-FS4nh_S/?utm_medium=copy_link

మరింత సమాచారం తెలుసుకోండి:

ntr