ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ తప్పనిసరి అయింది. మన గురించి మనం ఏది తెలియజేయాలన్న సోషల్ మీడియా కూడా అందుబాటులో ఉంది. దీంతో ఎవరి టాలెంట్ ఎంత ఉందో  నిరూపించుకోవడానికి వేదికగా మారుతోంది. దీంతో  కొంతమంది తమకు తెలియకుండానే  సోషల్ మీడియాలో విపరీతమైన స్టార్స్ గా మారుతున్నారు. మొన్నటికి మొన్న బుల్లెట్ బండి పాట తో  డాన్స్ చేసినటువంటి  పెళ్లి కూతురు  రాత్రికి రాత్రే సోషల్ మీడియాను కుదిపేసింది. గత రెండు రోజులుగా మళ్లీ సుఖీభవ అనే టీ పౌడర్ యాడ్ చేసినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.

అయితే దీన్ని ఉపయోగించి  హైదరాబాద్ పోలీసులు  వినూత్న ఆలోచన చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కాకుండా పౌరుల యొక్క వ్యక్తిగత భద్రత కోసం కూడా  పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడు ప్రేమించడం మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో చాలా రాష్ట్రాలలో ఎక్కువగా జనాలతో కనెక్ట్ అయి ఉండడం మన సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.    ఇందులో హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇంకా డిఫరెంట్ గా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాను,  గత కొద్ది రోజులుగా సుఖీభవ అనే వీడియో చాలా వైరల్ అవుతోంది.

నల్లగొండ శరత్ అనే వ్యక్తి టీ పౌడర్ యాడ్ ను రీ క్రియేట్ గా చేసి, డాన్స్ చేయడం అది కాస్త నెట్టింట్లో వైరల్ కావడం మనకు తెలిసిన విషయమే. ఈ సందర్భంలో కొంతమంది వ్యక్తులు మీరు ప్రైజ్మనీ గెలిచారు అంటూ ఆ యొక్క లింకులు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అలాంటి లింక్స్ ను ఓపెన్ చేయవద్దని, దానిలోని ఒరిజినల్ స్క్రీన్ షాట్ ను ఉపయోగించాడు. అయితే దీనిని శరత్ అనే వ్యక్తి ఏ సందర్భంలో తీసిందో ఎవరికి స్పష్టత లేనప్పటికీ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది దీన్ని పోలీసు వారు ప్రజలకు అవేర్నెస్  వచ్చే విధంగా వాడుకోవడం చాలా మంచి పరిణామం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: