ఒక నీటి జంతువు త‌ప్పి పోతే యావ‌త్ ప్ర‌పంచం మొత్తం బాధ ప‌డింది. ముఖ్యంగా జంతు ప్రేమికులు, ప‌ర్యాట‌కులు ఆ జంతువు త‌ప్పి పోయింద‌న్ని వార్త‌ను త‌ట్టు కోలేరు. ఆ జంతువు క్షేమంగా ఉండాల‌ని వీరు ఏకంగా పూజ‌లు కూడా చేశారు. అలాగే సోష‌ల్ మీడియా లో కూడా ఆ జంతువు గురించి చాలానే మాట్లాడారు. ఇంత‌కీ ఆ జంతువు ఎంటీ అంటే వాలీ. వాలీ అంటే ధ్రువ‌పు జీవి. సముద్ర జలాల్లో తన విభిన్న చేష్టలతో ప్రఖ్యాతి గాంచింది. దీనికి ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది ఎక్కువ ఆర్కిటిక్‌ ప్రాంత సముద్ర జలాల్లో క‌నిపిస్తుంది. ఇవి చాలా అరుదుగా ఉంటాయి. ఇది ఐర్లాండ్ లో ఉండేది. గ‌త కొద్ది రోజుల క్రితం ఇది త‌ప్పి పోయింది.



ఇది ఐర్లాండ్ లో ఉండేది. అక్క‌డి ప‌ర్యాట‌కుల‌ను వాలీ సంద‌డీ చేసేది. కానీ కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో వాలీ అభిమానులు అలాగే చాలా మంది జంతు ప్రేమికులు, పర్యాటకులు ఆందోళన చెందారు. వాలీ ఎక్క‌డా ఉన్న క్షేమంగా ఉండాలంటూ పూజ‌లు కూడా చేశారు. మ‌రి కొంత మంది అయితే సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. చివ‌రికి 22 రోజుల త‌ర్వాత వాలీ జాడ ల‌భించింది. ఈ 22 రోజుల‌లో దాదాపు 900 కిలో మీట‌ర్లు ప్ర‌య‌ణించింది. ఇలా ప్ర‌యాణించి ప్ర‌స్తుతం ఐస్ లాండ్ స‌మీపం లో వాలీ ఆచూకీ ల‌భించింది. వాలీ ఆచూకీ తెల‌యడం తో జంతు ప్రేమికులు, ప‌ర్యాట‌కులు సంతోషం వ్యక్తం చేశారు.



వాలీని ఐస్ లాండ్ దీవుల స‌మీపంలో బ్ర‌టిష్ షిప్ డైవ‌ర్స్ క‌నిపెట్టారు. వాలీ శరీరం మీద ఉన్న గుర్తుల ఆధారంగా ఇది వాలీ నే అని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ నిర్ధ‌రించింది. ఈ విష‌యాన్ని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ సిబ్బంది ట్వీట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. వాలీ 22 రోజుల నుంచి క‌న‌ప‌డ‌లేదు. ఇక వాలీ మ‌ళ్లి చేడ‌లేమో అని భయపడ్డామని అన్నారు. వాలీ ఆచూకీ దొర‌క‌డం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ట‌ర్ వేదిక‌గా చెప్పారు. వాలీ తిరిగి ఐర్లాండ్ దేశానికి రావ‌డానికి ఇప్ప‌టికే ఈదడం మొదలుపెట్టిందని తెలిపింది.  అయితే వాలీ దాదాపుగా వాలి దాదాపు 800 కిలోల బరువు ఉంటుంది. ఇది మ‌ళ్లి ఐర్లాండ్ కు రావాలంటే దాదాపు 4000 వేల కిలోమీట‌ర్లు ఈదుతుండ‌ట‌.






మరింత సమాచారం తెలుసుకోండి: