నాసా వారు ఈ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా నుంచి షేర్ చేసిన చిత్రానికి"హందు ఆఫ్ గాడ్"అని నామకరణం చేసి ఈ చిత్రాన్ని పోస్ట్ చేయడం జరిగింది. దీనిని ఎంతో మంది వీక్షించారు. ఈ చిత్రంలో ఒక చేయి కనిపిస్తోంది. మన చేతి వేళ్ళ మధ్యలో ఎలాగా ఉంటుందో అలా కొద్దిగా స్థలం ఉన్నట్లుగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ ఫోటో చుట్టూ మిగతా అంతా నలుపుగా ఉంది కొంచెం మాత్రమే బంగారు కలర్లు కనిపిస్తుంది.
ఇది నిజంగానే దేవుడు చేయి, లేదంటే మరి ఏదైనా అయినా ఆ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోని మనం కిందన చూడవచ్చు. ఈ బంగారు నిర్మాణం గల ఆకారం.. ఐస్కాంతం చేత విడుదలయ్యే శక్తి కణాలతో కూడినది అన్నట్లుగా నాసా తెలుపుతోంది. మనం చూసే టువంటి నక్షత్రాలలో ఏదైనా ఒకటి పేలితే ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నట్లుగా తెలియజేస్తోంది.వీటిని..PSRB 1509-58 అని పిలుస్తారట. ఇది అంతరిక్షంలో 19 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది అన్నట్లుగా సమాచారం. ఇక్కడ ఒక ఆశ్చర్య దగ్గ విషయం ఏమిటంటే.. ఇది సెకనుకు ఏడు సార్లు తనచుట్టూ తాను తిరుగుతూ ఉంటుందట. ఇది భూమి నుంచి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. నెటిజనులు ఈ చిత్రాలను చూసి బాగా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా దీనికి"మిడాస్ చేయి" అనే నామకరణం చేయాలంటే ఒక నెటిజన్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మరొకరు ఇది శివుడు మూడవ కంటి అని తెలియజేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి