ఇక దాదాపుగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు మొత్తం పూర్తయ్యాయి అదే చెప్పాలి. అయితే యాదాద్రి ఆలయం ఎంత సర్వాంగ సుందరంగా ముస్తాబు అయింది అన్న విషయాన్ని తెలిపే విధంగా ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ వీడియోలను చూసిన భక్తులందరూ కూడా మైమరచిపోయారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు తెలంగాణ తిరుపతిగా పేరుపొందిన యాదాద్రి ఆలయానికి సంబంధించిన మరో వీడియో కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోచూసి ఎంతో మంది ఇక త్వరలో యాదాద్రి ఆలయాన్ని సందర్శించాలి అని అనుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కాగా ప్రస్తుతం తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కోసం ముస్తాబు అవుతోంది. 2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణ జరిగిన తర్వాత భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు ఆలయ నిర్వాహకులు. అంతకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన హోమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ఆలయానికి సంబంధించిన వీడియోను ఇటీవలే రాష్ట్ర పర్యాటక శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది. డ్రోన్ కెమెరా లో తీసిన ఈ దృశ్యాలు భక్తులందరినీ కూడా కట్టిపడేస్తున్నాయి అనే చెప్పాలి. ఇక వినూత్నంగా తీర్చిదిద్దిన ఈ కమనీయమైన దృశ్యాలు అందరినీ మైమరపింప చేస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి