ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత ఇటీవలే ఆస్ట్రేలియా జట్టు కల నెరవేరింది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియాకు ఎన్నో ఏళ్ల నుంచి అటు టి20 వరల్డ్ కప్ అనేది అందని ద్రాక్ష అలాగే మిగిలిపోయింది. వన్డే క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు.. ఒక్కసారి కూడా టి20 వరల్డ్ కప్ మాత్రం గెలవలేకపోయింది. ఎన్నో సార్లు ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ చివరి నిమిషంలో తడబడుతూ కప్ గెలవలేక నిరాశతో వెనుదిరిగింది ఆస్ట్రేలియా జట్టు.


 ఇలా కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు  ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో మొదటి నుంచి ఆస్ట్రేలియా జట్టుకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా దుబాయ్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్లో కూడా టాస్ గెలవడం అనేది ఎంతో కీలకంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయినప్పటికీ అద్భుతంగా ఆడిన న్యూజిలాండ్ జట్టు భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. అయితే ఆ తర్వాత చేదనకు  దిగిన ఆస్ట్రేలియా జట్టు ఎక్కడ  తడబడకుండా అద్భుతంగా రాణించి టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో విజేతగా నిలిచింది.


 అయితే కొన్ని దశాబ్దాల నుంచి అందని ద్రాక్షల ఉన్నా టి20 వరల్డ్ కప్ దక్కించుకోవడంతో జుట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే డ్రెస్సింగ్ రూమ్ లో ఎంతో ఘనంగా ఈ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఇక ఈ సెలబ్రేషన్స్ కాస్త వింతగా కూడా జరిగాయి అన్నది అర్ధమవుతుంది. ఏకంగా కాలికి ఉన్న షు తీసి అందులో బీరు పోసుకుని తాగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ జట్టు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ తన తర్వాత స్టోయినిస్ కూడా అదే షూ లో బీర్ పోసుకొని తాగుతూ కనిపించాడు. దీంతో ఇక ఈ వీడియో చూసినవారువామ్మో ఇదెక్కడ సెలబ్రేషన్ అంటూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: