అడవికి రారాజు మృగరాజు అనే విషయం అందరికి తెలిసిందే. సాధారణంగా చాలామంది సింహాలను అటు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో చూస్తూ ఉంటారు.. మరికొంతమంది ఇక నేరుగా చూడటానికి జూ పార్క్ లకు వెళ్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.  జూ పార్క్ లోకి వెళ్ళిన సమయంలో ఇక అక్కడ సింహాన్ని నేరుగా చూసి ఎంతగానో భయపడిపోతుంటారు. కానీ కొంతమంది వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ లు మాత్రం ఏకంగా సింహాలకు దగ్గరగా వెళ్లి ఫోటోలు తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఏకంగా సింహాలకు దగ్గరగా వెళ్ళడం చూస్తూ ఉంటే  వాళ్ళని చూస్తున్న ప్రేక్షకులకే గుండె దడ పుడుతూ ఉంటుంది.


 అంతలా వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ లు ఎంతగానో రిస్కు చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫోటోలు తీస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు సింహాలు దాడి చేయడం  కూడా చేస్తూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది. సింహంతో ఫోటో తీసుకోవాలనుకో తప్పులేదు.. కానీ సింహం తో ఆట ఆడాలనుకుంటే  వేటాడేస్తది అని ఒక డైలాగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సింహం తో ఆటలు ఆడారు కొంత మంది టూరిస్టులు. అడవికి రాజైన సింహాన్ని ముప్పుతిప్పలు పెట్టారు  దీనికి సంబంధించిన వీడియో కోసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 దక్షిణ ఆఫ్రికా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.. పర్యాటక దేశంగా కొనసాగుతుంది దక్షిణాఫ్రికా.. ఇక దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ అడువులు అయితే ఎంతగానో ఫేమస్. ఇక ఇటీవలే suv సఫారీ కార్ లో ఒక పర్యాటక బృందం  అడవిలో పర్యటించడానికి వెళ్ళింది. అనుకోకుండా వారి కార్ ఒక గుంటలో ఇరుక్కుపోయింది. దీంతో కారు డ్రైవర్ టూరిస్ట్ జాబులని సలీం అనే వ్యక్తి ఉపాయంతో కారుని ఏదో విధంగా బయటకు తీశాడు.  ఇంతలో అక్కడికి ఒక మగ సింహం వస్తుంది. దీంతో అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు.. ఆ సమయంలో అందరూ కార్లోకి చేరుకుంటారు. అయితే కార్ ను గోతులో నుంచి బయటికి తీసిన తాడు మాత్రం వదిలేస్తారు. దీంతో ఇక ఈ తాడు మీద సింహం దృష్టి పెడుతుంది. దీంతో ఆ తాడు నోట్లో పెట్టుకొని కారు వెళ్లకుండా ఆపాలని ప్రయత్నిస్తోంది సింహం. ఇలా సింహం తోనే ఆటలు ఆడుకుంటారు టూరిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి: