ఫీల్డర్ క్యాచ్ పట్టిన తర్వాత బ్యాట్స్మెన్లు పరుగులు తీయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. బౌలర్ వేసిన బంతి ఫీల్డ్ అంపైర్ ఫుట్ ఫ్రంట్ నో బాల్ గా పరిగణించాడు. ఇక ఇది అర్థం చేసుకున్న ఫీల్డర్ కష్టపడి క్యాచ్ పడితే వృధా అయింది అంటూ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సిడ్నీ థండర్ బౌలర్ మెక్ ఆండ్రూ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ నిక్ లార్కిన్ కి ఫుల్ టాస్ బంతి వేసాడు. ఇక ఈ బంతిని స్క్వెర్ లెగ్ దిశగా కొట్టాడు. అయితే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డేనియల్ సాగ్స్ వెనక్కి వెళ్లి రెండు చేతులతో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్రమం లోనే ఇక వికెట్ తీశాను అన్న ఆనందంలో సెలబ్రేషన్స్ షురూ చేశాడు.
కానీ అటు మైదానం లో బ్యాట్స్మెన్లు మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నాడు. దీంతో డేనియల్ సాన్స్ కి ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు. కానీ అసలు విషయం తెలిసి తెగ ఫీల్ అయిపోయాడు. బౌలర్ మేక్ అండ్రు వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ నో బాల్ గా పరిగణించారు. దీంతో ఇక అతడు క్యాచ్ పట్టినప్పుడు బ్యాట్ మెన్స్ పరుగులు తీస్తూనే ఉన్నారు. అయితే ఇక ఈ విషయం తెలిసిన తరువాత ఎంతో కష్టపడి క్యాచ్ పడితే ఫలితం లేకుండా పోయిందే అంటూ ఎంతో నిరాశకు గురయ్యాడు.ఇక ఈ మ్యాచ్లో సిడ్నీ థండర్ పై మెల్బోర్న్ స్టార్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి