ఇక పిడకలు ఎలా తయారు చేస్తారు.? ఇందుకోసం ప్రత్యేకంగా పాఠాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది.? వామ్మో..  ఏంటీ? ఈ పిడకలు తయారు చేయడం ఎలాగో నేర్చుకోవడానికి కూడా పాఠాలు చెబుతారా..అని మీరు కూడా ఆశ్చర్యపోతున్నారా.! కానీ మీరు చదివింది అక్షరాల నిజమే. పిడకాలు ఎలా తయారో చేయాలో చెబుతూ ఓ యూనివర్సీటీలో ఈ పాఠాలు చెప్పారు. పలు గ్రామాల్లో మహిళలు అలవోకగా చేసే పిడకలను యూనివర్సిటీలో పాఠాలు చెప్పడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ అనేదే జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది..ఇక పూర్తి వివరాల్లోకి గనుక వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇటీవల ఒక వర్క్‌ షాప్‌ అనేది జరిగింది. ఈ సందర్భంగా సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశల్ కిషోర్ మిశ్రా స్టూడెంట్స్ కి ఇక ఈ పిడకల తయారీ గురించి నేర్పించారు. ఇక అంతటితో అతను ఆగకుండా పిడకల వల్ల కలిగే లాభాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. 

పిడకలను పూజలు ఇంకా హోమాల్లో ఉపయోగిస్తారని అలాగే వీటిని ఆహారం వండేందుకు కూడా వాడతారని ఆయన తెలిపారు. ఇక అంతటితో ఆగకుండా ఆవు పేడతో చేసిన ఉత్పత్తులను  కూడా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఇక దీంతో రైతుల ఆదాయం కూడా బాగా పెరుగుతుందని ప్రొఫెసర్‌ చెప్పుకొచ్చారు.ఇక ప్రొఫెసర్‌ మధ్యలో కూర్చొని పిడకలు చేస్తుండగా విద్యార్థులంతా కూడా అక్కడ చుట్టూ చేరి పేడతో పిడకలను చేస్తున్నారు.ఇక దీనంతటినీ కూడా వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు వర్సిటీ తీరుపై అనేక రకాల విమర్శలు కురిపిస్తున్నారు. వర్సిటీలకు వెళ్లేది జ్ఞానం సంపాదించుకోవడం కోసమని అంతేగాని ఇలా పిడకలు తయారు చేయడానికి కాదంటూ వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ గ్రామీణ మహిళలు ఇలాంటి శిక్షణను సులభంగా చేస్తారని ఇంకా అందుకు ప్రొఫెసర్లు అవసరం కూడా లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: