ఆలోచనలు మనుషులను మరో స్థాయి లో నిలబెడతాయి. మంచి చేయాలి పది మంది ఆకలిని తీర్చాలి అనే ఆలోచన రావడం ఇంక గ్రేట్.. లేని వారికి కడుపు నింపితే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని కొందరు నమ్ముతారు..ఆ విషయాన్ని ఆదర్షంగా తీసుకొని ఇప్పుడు ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు.  తక్కువ ధరకే భోజనాన్ని అందించాలని అనుకున్నాడు. అదే ఆలోచన తో ముందుకు వెళుతున్నారు.. అతని పేరు ఇప్పుడు ఎక్కడ చూసిన మారు మోగిపొతుంది. ఇది నిజంగా గ్రేట్ ఆలోచన అని  చెప్పాలి.


అతను ఎన్నో కష్టాలను చూశాడు. సగం కడుపుతో ఎన్నో రోజులు పస్తులు ఉన్నాడు. ఆకలి బాధ తెలిసిన అతను పది మంది ఆకలిని తీర్చాలని అనుకున్నాడు.. చాలా కష్టపడి అందరి కడుపును నింపుతున్నారు. ఆకలి అన్న వాళ్ళ ఆకలిని తీరుస్తున్నాడు. ఆ ప్రాంతం అంతా అతని పేరు ఫెమస్ అయ్యింది. విషయానికొస్తె.. మధ్య ప్రదేశ్ కు చెందిన శివమ్ అనే వ్యక్తి పేదల పాలిట దేవుడు అయ్యాడు.పెద్ద చదువులు చదివి హోటల్ బిజినెస్ ను చేస్తున్నారు. కాగా, సొరియాసీస్ అనే తీవ్రమైన చర్మవ్యాధి బారినపడ్డాడు. దీనితో వ్యాపారం దెబ్బతింది. తన రెస్టారెంట్‌ను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ నష్టం కూడా ఏర్పడింది.


అలా అతను దిక్కు తోచని స్థితిలో ఇక్కడ నుంచి ఇండోర్ కు వెళ్లాడు. చాలా రోజులు ఆకలి తో ఉన్నాడు. తర్వాత ఏదొక విధంగా డబ్బులను సంపాదించి సగం కడుపును నింపుకున్నాడు. కష్టాల నుండి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకున్న శివమ్ తనకొచ్చిన విద్యనే మొదలుపెట్టాడు. చిన్నగా ఎదిగాడు… ఇండోర్‌లో తల దాచుకోడానికి వచ్చిన శివమ్ ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి రూ. 10కే భోజనం అందిస్తున్నాడు.. ఒకప్పుడు మెతుకు కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు ఇలా చేయడం పై అందరు ఆసక్తి పెరుగుతుంది.డబ్బులు లేని వాళ్ళకు ఉచిథంగా కూడా పెట్టెవాడు.ఇండోర్ అతని హోటల్ కు బాగా పేరు కూడా వుంది. మొత్తానికి ఎదురు దెబ్బలు జీవితానికి గుణ పాఠం చెప్పాలి. మనిషికి ఆలోచన వుంటే ఏదైనా చివరికి మంచి సక్సెస్ ను అందుకుంటున్నారు..



L

మరింత సమాచారం తెలుసుకోండి: