ఇటీవల న్యూజిలాండ్ వేదికగా ప్రారంభమైన మహిళల వన్డే ప్రపంచకప్ ఎంతో హోరా హోరీగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి జట్టు కూడా కప్పు గెలవడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తూ ఉందట.. ఇకపోతే క్రికెట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ప్లేయర్లు మైదానంలో అద్భుతమైన ఫీల్డింగ్  చేసి ప్రేక్షకులను ఆశ్చర్య పరచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎవరైనా ప్లేయర్ ఇలా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లోకి రావడం అక్కడ చక్కర్లు కొట్టి ఎంతోమందిని ఆశ్చర్య పోవడం జరుగుతుంటుంది.


 ఇప్పుడూ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది. ప్రస్తుతం మహిళా క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు వరుసగా రెండవ ఓటమి ఎదురైంది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది.  ఇక అంతకుముందు వెస్టిండీస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును ఓడించి విజయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో చేరుకుంది. అదే సమయంలో వరుసగా రెండు అపజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుంది ఇంగ్లాండ్ జట్టు.


 ఇక ఇలాంటి సమయంలో గెలిచిన వెస్టిండీస్ జట్టు కంటే ఏకంగా వెస్ట్ఇండీస్ కు చెందిన డియాండ్రా డాటిన్  పైన ఎక్కువ చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. దీనికి కారణం ఆమె అద్భుతమైన క్యాచ్ పట్టడమే. ఇటీవలే డియాండ్రా డాటిన్ పట్టిన క్యాచ్ చూసి నెటిజన్లు అందరూ బిజీ అవుతున్నారు. ఇంగ్లాండు ఓపెనర్ లారెన్ విన్ఫీల్డ్ కొట్టిన బంతిని పాయింట్ మీద ఫీలింగ్ చేస్తూ అద్భుతంగా అందుకుంది. ఒక చేత్తో ఎడమ వైపు గాల్లోకి ఎగురుతూ ఆశ్చర్యకరమైన రీతిలో క్యాచ్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా  మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: