భోజన ప్రియులు ఎక్కడ ఫుడ్ రుచిగా వుంటే ఆ హోటల్స్ ను ఎంచుకుంటున్నారు.. ఎం తినాలని అనుకున్నా కూడా ఆ హోటల్ లోనే భోజనం చేయడానికి తరచూ అక్కడికి వెళతారు. అలాంటి ప్రముఖ హోటల్స్ ఒకటి సుబ్బయ్య గారి హోటల్.. ఈ హోటల్ లో ఉన్న ప్రత్యేక వంట అని ఏది లేదు..ప్రతి ఒక్క ఐటమ్ కు అక్కడ బాగా ఫేమస్. అందుకే ఆ హోటల్ తెరచినప్పటి నుంచి ఇప్పటివరకు రుచి లో కాంప్రమైజ్ ఎవ్వరు. అందుకే ఆ హోటల్ రోజు రోజుకు ఫెమస్ అవుతుంది.


అక్కడ రుచులు కూడా బాగా ఉండటంతో అందరూ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే ప్రాచుర్యం  పొందుథుంది. రష్యా- ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో నూనె తో చేస్తున్న వంటలకు బ్రేక్ పడింది. ఎంతో ఫెమస్ అయ్యిన సుబ్బయ్య గారి హోటల్ లో కూడా ఇప్పుడు చాలా వంటలు మెనూ నుంచి మాయం అయ్యాయి.నో పూరి. నో బజ్జీ. అన్నీ ఉడికింపు వంటలే. ఆవిరి కుడుములు, ఇడ్లీలు, దోశలే. ఇదంతా ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావమే. రెండు దేశాలు కొట్టుకుంటే మాత్రం మిగితా దేశాలకు తిప్పలు మాత్రం తప్పలేదు.


మొన్నటివరకు కిలో రూ.138 వరకు ఉన్న ప్రముఖ సన్‌ఫ్లవర్‌ బ్రాండ్‌ నూనె ఇప్పుడు రూ.175, అయిదు లీటర్లు రూ.890, 15 లీటర్ల డబ్బా రూ.2,7820 వరకు పెరిగిపోయింది.. 25 కిలోలు కొనే కుటుంబాలు ఇప్పుడు ప్యాకెట్ నూనె తో కాలం వెల్లబొస్తున్నారు. టిఫిన్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. తప్పని పరిస్థితుల్లో అందరూ తింటున్నారు. పెద్ద హోటల్స్ ఇలా అయితే చిన్న బండ్లు కూడా ధరలను పెంచారు.ఇకపోతే గ్రామాల్లోను దోసె, పూరీ రేట్లు పెరిగాయి. కొన్ని హోటళ్లయితే ధరలు పెంచడానికి బదులు పూరీ, బజ్జీ వంటి ఎక్కువ నూనె వినియోగించే టిఫిన్ల విక్రయాలు నిలిపివేశాయి.. చికెన్ ధరలు కూడా పెరగడం తో వాటికి సంబంధించిన వంటలు కూడా భారీగా పెరిగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: