మృతులలో జస్పీందర్ సింగ్, హర్ ప్రీత్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ , కరణ్ పాల్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. అయితే అందరూ ఒకే రాష్ట్రానికి చెందిన విద్యార్థులు గా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది.. కెనడా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 3: 45 నిమిషాలకు ఈ సంఘటన వెస్ట్ ఒంటారియో ప్రావిన్స్ లో జరిగింది. విద్యార్థులంతా కూడా టొరంటో యూనివర్సిటీ విద్యార్థులు గా పోలీసులు విచారణలో తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే వీరంతా కూడా 401 జాతీయ రహదారిపై టొరంటో వైపు వెళ్తున్న సమయంలో ప్యాసింజర్ వ్యాన్ - ట్రాక్టర్ ట్రాలీ ని అతి వేగంగా ఢీకొట్టడంతో ఈ ఐదు మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.
పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతేకాదు గాయపడ్డ విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం విద్యార్థుల కుటుంబాలకు అప్ప చెప్పనున్నారు.. ఇకపోతే పోలీసులు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం పంపించిన వెంటనే భారత హైకమిషనర్ అజయ్ బిసారా కి తెలియజేయడంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. మృతదేహాలను భారతదేశానికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి