హోలీ పండుగ వచ్చిందంటే చాలు చిన్నల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోవడానికి పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో చాలా ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యంగా మద్యం మత్తులో ఎంతోమంది విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ ఒక యువకుడి ప్రాణం మీదకు తీసుకు వచ్చాయి. మిత్రులతో కలిసి చిందులు వేశాడు ఒక యువకుడు. అంతలో ఏకంగా కత్తి తీసుకుని గుండెల్లో పొడుచుచుకున్నాడు.


 అయితే ఇలా గుండెల్లో ఏకంగా నాలుగు సార్లు పొడుచుకున్న తర్వాత  గాని అతను గాయం అయింది అన్న రియలైజ్ కాలేదు.. రక్తం కారుతుంటే చూసుకొని వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఇక వెంటనే గమనించిన బంధుమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భాగాంగా ఏరియాలో వెలుగులోకి వచ్చింది. గోపాల్ సోలంకి అనే యువకుడు రాత్రి సమయంలో హోలీ వేడుకలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు.


 ఈ క్రమంలోనే ఫుల్ గా సౌండ్ పెట్టుకొని చిందులు వేసాడు. ఇంతలో తన చేతిలోకి ఒక కత్తి తీసుకుని కొంత సేపు కత్తితో
 సాంగ్ కి అనుగుణంగా కత్తితో స్టెప్పులు వేసాడు సదరు యువకుడు. చేతిలో కత్తి పట్టుకున్న అన్న విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. గుండె పై చెయ్యి వేస్తూ పొడుచుకున్నాడు. ఇలా ఏకంగా నాలుగు సార్లు గుండె లో కత్తి దిగింది.  నాలుగు సార్లు పొడుచుకునప్పటికే అతను కత్తితో గాయం చేసుకున్నాడనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు. ఇక మొత్తం రక్తం చిమ్మడం తో  చేయి రక్తంతో నిండి పోయింది. వెంటనే గమనించినా  మిత్రుడులు ఆస్పత్రికి తరలించారు.  అప్పటికే అతను మృతి చెందినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: