బస్సులలో కూడా మగాళ్ల ఆగడాలకు హద్దులు లేకుండా పోయింది. ఏదొక విధంగా తోటి ప్రయాణికులకు ఇబ్బందులను కలిగిస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందులు ఎంతగా చర్యలను తీసుకుంటూ వస్తున్న కూడా కొందరిలో మాత్రం మార్పులు రావడం లేదు. ముఖ్యంగా తాగి బస్సులు ఎక్కరాదని ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా మొత్తుకున్న కూడా మందుబాబులు మాత్రం రెచ్చిపోతున్నారు. గతంలో చాలా మందిని ఆర్టీసీ సిబ్బంది అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా అలానే బస్సులను ఎక్కడానికి వస్తున్నారు. మగ కండక్టర్లు అయితే ఏదొక మాట అని వదిలేస్తున్నారు. కానీ మహిళల పై లేదా మహిళా కండక్టర్లను వెదింపులకు గురి చేస్తున్నారు.
పది మందిని సురక్షితంగా తమ గమ్యాలకు చెరుస్తున్న బస్సుల లో ఇలా జరగడం సభ్య సమాజం తల దించుకునే పని అని చెప్పాలి.. ఇప్పుడు ఓ మద్యం బాబుకు మహిళా కండక్టర్ చెంప పగల గొట్టి బుద్ది చెప్పింది. బస్సులో అతని ప్రవర్తన పై విసుగు చెందిన ఆమె బస్సు ఆపి అతనికి బుద్ది చెప్పింది. ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరూ అభినందించారు.. తగిన బుద్ది చెప్పావు. ఇంకోసారి తాగడు అని చెప్పుకొచ్చారు..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.వరంగల్ జిల్లాలో ఇలాంటి ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పింది ఓ మహిళా కండక్టర్. పీకల దాకా మద్యం తాగాడు.. ఆపై ఆర్టీసీ బస్సెక్కాడు. టికెట్ తీసుకోకుండా ఎకసెక్కాలాడాడు. మొదట కాస్త ఓర్పుగా ఉన్న ఆమె ఎన్ని సార్లు వారించినా కూడా అతను వినడం లేదు.. ఆమె తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె సహనం కోల్పోయింది. మందుబాబు వేషాలు శృతిమించడంతో చెప్పుతో సమాధానమిచ్చింది. వరంగల్ జిల్లా వర్దన్నపేటలో వెలుగు చూసింది.కోపం పట్టలేని మహిళా కండక్టర్.. మందుబాబుని బస్సులోంచి దింపేసి చెప్పుతో కొట్టింది. పోలీసులకు చెప్పెలొపు అక్కడి నుంచి పారి పోయాడు..ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి