దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అస్సలు ఏ మాత్రం ఆలోచించకుండా ఇలా పెట్రోల్, డీజిల్
ధరలు పెంచుతూ పోతుండటంతో   సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ఇలా పెట్రోల్, డీజల్ ధరలు పెంచేస్తూ పోతే సామాన్య ప్రజలు వాహనాలను వదిలి పరుగులు తీస్తారు అంటూ తమ గోడును చెప్పుకుంటున్నారు. ఆర్థిక భారం పెరిగిపోతుండటం తో వారు ఈ రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 నేడు మళ్ళీ  పెట్రోల్, డీజల్ ధరలు పెంచేయడం తో సామాన్యులు అసంతృప్తి తెలియచేస్తూ ఏంటి ఈ అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ మరియు లీటర్‌ డీజిల్‌ ధర పై డీజిల్ ధర రూ. 95.07
పైసలు పెంచారు.  
దీనితో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.81 కు చేరింది.
 
తెలంగాణ రాష్ట్ర రాజదాని  హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 117. 23 కు చేరగా.. డీజిల్ ధర రూ. 103. 32 కు పెంచారు.
ముంబై లో లీటర్‌ పెట్రోల్‌ మరియు లీటర్‌ డీజిల్‌ పై 84 పైసలు పెంచారు. దీంతో అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 118.83 , కు చేరగా డీజిల్ ధర రూ. 103.07 కు చేరింది.
ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 119. 01 కు చేరగా డీజిల్ ధర రూ. 105. 54 కు చేరింది.

దేశంలో మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం లో అలా ఏదో కొంచం  పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ ఎలక్షన్స్ అనంతరం ధరలను పెంచడం మొదలు పెట్టేసింది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి  చివరకు సామాన్యులే ఎక్కువగా ప్రభావితం చెందుతున్నారు. పెరిగిన ధరలతో తమ బడ్జెట్ మ్యాచ్ కాక ఇబ్బంది పాలు అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: