భార్యా భర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే ఎంత పెద్ద గొడవ అయిన చిన్న నవ్వుతో పరిష్కరించుకొని బయట పడాలి. లేకుంటే మాత్రం వాటి ఎఫెక్ట్ దారునాలకు దారి తీస్తాయి.. కొన్ని బంధాలు మాత్రం విడిపోయేలా చేస్తాయి.మరి కొన్ని బంధాలు మనుషుల ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేకుండా చేస్తాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ ఘటన వెలుగు చూసింది..భార్యా,భర్తల మధ్య మొదలైన చిన్న గొడవ పెద్ద తగాదాకు దారి తీసింది.. భర్త మీద కోపంతో ఓ భార్య ఏకంగా బెడ్ పైన ఇద్దరికీ సంబంధం లేదు అని గోడ కట్టింది. ఆమెకు ఎలా సర్ది చెప్పాలో తెలియక చూస్తూ ఉండి పోయాడు.


అది చూడటానికి చాలా ఫన్నిగా అనిపించింది. అందుకు సంభందించిన కొన్ని ఫోటోలు,వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతూనే ఉంటాయి. ఇది కొత్త విషయం కానప్పటికీ.. కొన్నిసార్లు గొడవలు పరిస్థితి అదుపు తప్పేలా చేస్తాయి. ఇటీవల కాలంలో నెట్టింట భార్యాభర్తల గొడవలకు సంబంధించిన వీడియోలు కాస్త ఎక్కువగా వైరల్ అవుతూ వస్తుంది.. అంతగా అతని తో పడుకోలేను అనుకుంటే దూరంగా పోవాలి ఇలా గోడ కట్టడం ఏమిటి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న వీడియో.. ఇద్దరు ఒకరి మొహాలు చూసుకుంటూ కోపంగా కనిపిస్తారు...తన పక్కన కూర్చున్న భర్తకు మధ్య తాపీతో గోడ కట్టడాన్ని చూడవచ్చు. ఈ క్లిప్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మహిళ ఈ గోడను ఇటుకల తో కడుతుంటే, భర్త  ఆమె పై గుర్రు పెట్టి చూస్తాడు..మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటలలోనే బాగా ఫెమస్ అయ్యింది..దీనికి నెటిజన్లు అదిరిపోయే రియాక్షన్‌లు ఇస్తున్నారు. భార్యాభర్తలన్నాక గొడవలు కామన్ అని.. గోడ కట్టే బదులు తమలో తాము మాట్లాడుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ గోడ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది..మీరు ఒకసారి చూడండి...



మరింత సమాచారం తెలుసుకోండి: