ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు తల్లిదండ్రులకు వరకు కూడా ఇలాంటి వ్యవహారాలు వెళ్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు ఏకంగా స్కూల్ కాలేజీకి చెందిన విద్యార్థులు మాత్రమే ఏదో ఒక విషయంలో గొడవ పడి రోడ్డుమీద కొట్టుకోవడం లాంటివి చూశాము. కానీ మొన్నటికి మొన్న ఒక యువకుడి కోసం ఇద్దరు యువతులు కాలేజీ లో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నటికి నిన్న ఏకంగా కాలేజీ విద్యార్థునులు గ్యాంగుల ఏర్పడినది రోడ్డుమీద కింద మీద పడి కొట్టుకు ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇప్పుడు మరోసారి ఇలాగే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కాలేజీ విద్యార్థునులు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. అది చూసి మిగతా విద్యార్థులు అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది ఎక్కడో జరిగింది కాదు మన విజయవాడలో జరిగింది కే జి ఎన్ కాలేజీ కి చెందిన ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. తోటి విద్యార్థులు ఎంత ఆపినా కూడా ఎవరూ తగ్గలేదు. ప్రేమ వ్యవహారం లోనే ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు అనే విషయం తెలుస్తోంది దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి