సాదారణంగా భార్యల ఫోటోలను సోషల్ మీడియాలో లేదా పర్సనల్ గా ప్రోఫైల్ ఫోటోను పెడుతున్నారు.అలా కొన్ని వాటికి మంచిది కానీ మరి కొన్ని వాటికి పెడితే వాటిని కొందరు తీసుకొని అసాంఘిక కార్యకలాపలకు వాడుతున్నారు.. లేదా తప్పుడుగా చిత్రీకరించి నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్య మీద ప్రేమతో ఆమె ఫోటోను డీపీ గా పెట్టుకున్నాడు. అది కాస్త అతనికి తీవ్రమైన బాధను కలిగిస్తుంది. ఆ ఫోటోను సైబర్ నేరగాళ్లు తీసుకొని న్యూద్ గా చిత్రీకరించి బెదిరింపులకు దిగారు.


వివరాల్లొకి వెళితే..చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అయ్యన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు..అసలు విషయాన్నికొస్తే..వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. ఆ ఫొటోను ఓ సైబర్ కేటుగాడు డౌన్‌లోడ్ చేసి మార్ఫింగ్ చేశాడు. ఆమె మాములు ఫొటోను ఓ నగ్న ఫొటోగా మార్చేసి ఆమె భర్తను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకపోతే ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఏం చేయాలో పాలుపోని ఆ భర్త పోలీసులను ఆశ్రయించాడు..


పోలీసులు అసలు విషయాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు.సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ కు ఈ కేసును బదిలీ చేశారు.ఎవరో తెలిసిన వారే అతని భార్య ఫొటోను సేవ్ చేసుకుని ఇలా డబ్బు కోసం మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారేమోనన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగుతోంది. మహిళలనే కాదు వారి ఫొటోలు కనిపించినా ఆ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేసి వేధింపులకు గురిచేసే స్థాయికి పరిస్థితి దిగజారింది.. అందుకే ఎంత ప్రేమ వున్న ఇలా భార్యల ఫోటోలను సోషల్ మీడీయా పెట్ట కూడదు అని పోలీసులు హెచ్చరించారు.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: