ఈరోజుల్లో మనుషుల కన్నా ఎక్కువగా మూగ జంతువులు ప్రేమలు పంచుతున్నాయి. మనుషుల పట్ల మానవత్వం తో మెసలుతున్నాయి. ఒక పూట అన్నం పెడితే వారికి జీవితాంతం రుణపడి ఉంటాయి. అదే అంటున్నారు కుళ్ళు, కుథంత్రాలతో నిండిపోయిన మనుషుల తో పోలిస్తే 100 రేట్లు వాళ్ళే మేలని చెప్పాలి. మనం ఏది చెయ్యకుండా మాత్రం మనల్ని అవి ఏమి చెయ్యవు. ఇప్పుడు వెలుగు చూసిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..ఏనుగు వల్ల ఆ మహిళ సుఖ ప్రసవం అయ్యింది..ఏంటి.. ఇది నిజమా అనే ఆలోచన అందరికి కలుగుతుంది.


తమిళనాడు లో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది..వివరాల్లొకి వెళితే..ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు గర్భిణిగా ఉన్న గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసింది.ఆ ఏనుగు చేసిన పని వల్ల ఆమెకు సుఖ ప్రసవం అయ్యింది. దారిలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది..అంతగా ఏనుగు ఎం చేసింది అనేది ఇప్పుడు చుద్దాము..అటవీ ప్రాంతానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళుతున్నారు.అంబులెన్స్ ఘాట్‌ రోడ్డుమీద ప్రయాణిస్తోంది. అంబులెన్స్ లో గర్భిణి ప్రసవవేదన పడుతోంది.


ఓ భారీ ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడింది.. ఎంతగా హారన్ కొట్టిన కూడా పక్కకు తప్పుకోలేదు. ఇక మహిళకు ప్రసవం చేయడానికి సిబ్బంది బాగా కష్టపడ్డారు. దాదాపు అరగంట పాటు ఆమెకు వైద్యం చేశారు. దాంతో ఆమెకు సుఖ ప్రసవం చేశారు.అలా ఆమెకు అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం జరిగి పడంటి మగ శిశువు జన్మనిచ్చింది.ఇంత జరిగాక ఆ ఏనుగు అక్కడి నుంచి కదిలింది. రోడ్డును వదలి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో మహిళతోపాటు పసి బిడ్డను అంబులెన్స్‌లో స్థానిక గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఆ ఏనుగు నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: