ఇటీవలి కాలంలో డబ్బులు ఉన్నా లేకపోయినా అటు పెళ్లి ఎంతో అంగరంగవైభవంగా చేసుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ ఇక  జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి ఇక జీవితాంతం గుర్తుండిపోయే విధంగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఎక్కడా వెనకాడకుండా ఏది తక్కువ కాకుండా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పాలి. అంగరంగ వైభవంగా ముస్తాబు చేయబడిన పెళ్లి పందిరి లోకి డాన్సులు చేస్తూ ఎంట్రీ ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నారు.



 అయితే ఇక పెళ్లి బంధుమిత్రులు అందరు సమక్షంలో అంగరంగ వైభవంగా జరగడం ఒక ఎత్తు అయితే పెళ్లి అనంతరం జరిగే బరాత్ ఒక ఎత్తు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే పెళ్లి ఎలా జరిగినా బరాత్ మాత్రం అద్భుతంగా జరగాలని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక స్నేహితుడి పెళ్లి బరాత్ లో తెగ ఎంజాయ్ చేయాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. డీజే పాటలతో బ్యాండ్ బాజా తో పెళ్లి బరాత్ లో ఎంతలా సందడి నెలకొంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణం గా పెళ్లి బరాత్ లో నాగిని డాన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది.



 ఇక తమదైన శైలిలో నాగిని డాన్స్ చేసి అక్కడ ఉన్న వారందరిని  కూడా అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ నాగిని డాన్స్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. అదేంటి బరాత్ లో నాగిని డాన్స్ కి కొత్తేం కాదు కదా.  ఎందుకు అంతలా షాక్ అవ్వడం అని అనుకుంటున్నారు కదా. ఇప్పటివరకు పెళ్లి బరాత్ లో మనుషులు నాగిని డాన్స్ చేయడం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నిజమైన పాము ని తీసుకువచ్చి నాగిని డాన్స్ చేయించారు. ఒడిశాలోని మయూర్ బంజ్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగు పాములు తెచ్చి నాగిని డాన్స్ చేయించడంతో వందలమంది చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో వైరల్ గా మారి పోవడం తో ఏకంగా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: