సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన ఘటనలూ కూడా కేవలం క్షణ కాల వ్యవధిలోనే అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో వాలి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయ్. ఏకంగా బద్ద శత్రుత్వం ఉన్న జంతువులు సైతం ఎంతో ప్రేమగా మెలుగుతూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో శత్రువుల్లా ఉండే కుక్క పిల్లి కలిసి ఉండటం చూశామూ. అదే సమయంలో కుక్క కోతి సైతం ఒకేచోట ఏకంగా స్నేహితులుగా కలిసి తిరగడం కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.



 ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు చూసినప్పుడు ఇది ఎలా సాధ్యమైంది అని నెటిజన్లు షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే వైరల్ గా మారిపోయింది. సాధారణంగా లేగదూడ తమ అమ్మ ఆవు దగ్గర పాలు తాగడానికి ఇష్ట పడుతూ ఉంటుంది. ఆకలేసిందంటే తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కడుపునిండా పాలు తాగడం వంటివి చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక లేగదూడ ఏకంగా ఆ అవును కాదు అని వేరొక జంతువు దగ్గర పాలు తాగడానికి ఇష్టపడుతుంది. ఇక ఆ మరో జంతువు కూడా తన కడుపున పుట్టకపోయినా ఎంతో ప్రేమగా పాలు ఇస్తూ ఉండడం గమనార్హం.


 ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.  ఒక ఆవు దూడ ఏకంగా కుక్క దగ్గర పాలు తాగుతూ ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తుముకూరు జిల్లా కందుకూరు లో తల్లిని కాదని కుక్క దగ్గర కూడా పాలు తాగడానికి వెళ్ళటం చూసి గ్రామస్తులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కుక్క కూడా తరచూ అక్కడికి వస్తూ లేగ దూడకు పాలు ఇస్తుంది అని చెబుతున్నారు స్థానికులు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారి పోవడం తో ఇది చూసేందుకు చుట్టుపక్కల జనం తరలివస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: