మనుషులు జంతువుల మధ్య ఉండే ప్రేమ స్నేహబంధం ఎప్పుడు అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక చూడటానికి కూడా ముచ్చటిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మనుషులు జంతువుల మధ్య ప్రేమ బంధం గురించి మాట్లాడుకోగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది పెంపుడు కుక్కలు యజమాని మధ్య ఉండే ప్రేమ బంధం. యజమాని పెంపుడు కుక్క పైన ఎంత ప్రేమ చూపిస్తాడో అంతకు మించిన విశ్వాసాన్ని యజమాని పట్ల చూపిస్తూ ఉంటుంది కుక్క.


 కానీ ఇక్కడ ఒక వీడియో చూసిన తర్వాత మాత్రం కేవలం పెంపుడు కుక్కలు యాజమాని మధ్య మాత్రమే కాదు ఏనుగులు మావటివాడు మధ్య కూడా ఎంతో ప్రేమనుబంధం ఉంటుంది అన్నది అర్థమవుతూ ఉంటుంది. సాధారణంగా మావటివాడు అనే పేరు చెప్పగానే ఏనుగులను భయపెట్టి కంట్రోల్లో పెట్టుకుంటాడు అనే ఆలోచన మాత్రమే అందరికీ వస్తూ ఉంటుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఏనుగుకు మావటివాడు కి మచ్చ స్నేహ భావం కూడా ఉంటుంది అన్నది అర్థమవుతూ ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ప్రతి ఒకరి మనసును పులకరింప చేస్తుంది అని చెప్పాలి.


 ఒకసారి ఈ వీడియోలో చూసుకుంటే మావటివాడు హాయిగా ఒక బెడ్ పై పడుకొని ఉంటాడు. ఇది చూసిన గున్న ఏనుగు అక్కడికి వస్తుంది. ఇది నా బెడ్.. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్లుగా మావాటి వాడిని నిద్ర లేపుతూ ఉంటుంది. ఇక మావటివాడు ఎంతకూ లేవకపోయేసరికి అతన్ని పక్కకు నెట్టేసి మొత్తాన్ని ఆక్రమించి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మావాటి వచ్చి పడుకోవడం తో అలిగిన ఏనుగు పక్కకు వెళ్లి పోతుంది. చివరికి మావటివాడు ఆ ఏనుగును పిలుచుకొని వచ్చి.. ఇక ఏనుగు తో పాటు పరుపుపై  పడుకుంటాడు.  ఇలా ఏనుగు  మావటివాడు మధ్య ప్రేమ చూసి అందరికీ మనసు పులకరించి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: