తీపి వస్తువులు అంటే అందరికి ఇష్టం ఉంటుంది.. లడ్డు, బూందీలతో పాటు ఎక్కువగా చాక్లెట్‌ లను కూడా ఎక్కువ తింటారు.. అయితే ఈ వినిపిస్తున్న వార్తల కారణంగా చాక్లెట్ తినడం అంటే జనాలు భయ పడుతున్నారు..ఇప్పటికే ఎన్నో రకాల విషయాలు బయటకు రావడం తో చాక్లెట్‌ల వాడకం తగ్గిందని అంటున్నారు..అతి తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని డాక్టర్లు ఒకవైపు చెబుతున్న కూడా జనాలు పట్టించుకున్న పాపానా పోలేదు. అయితే ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి..ఇప్పటికే చాక్లెట్ లలో ఏవేవో వచ్చాయి.వాటిని చూసిన జనాలు భయంతో వణికి పోతున్నారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది.


అప్పట్లో ఎక్కువ నట్స్‌ కలిగిన ఓ బ్రాండ్‌ చాక్లెట్స్‌పై అనేక విమర్శలు వచ్చాయి. వాటిల్లో పురుగులు ఉన్నాయంటూ కొందరు కస్టమర్లు కంప్లైట్‌ చేశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దాంతో చాక్లెట్‌ కొనుగోలు చేసిన సదరు వినియోగదారు ఏకంగా రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు.ఒక చాక్లెట్‌ బార్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించాడు. దాంతో క్యాడ్‌బరీ కస్టమర్ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆ సిబ్బంది పురుగులున్న చాక్లెట్‌ను తిరిగి ఇవ్వాలని అడిగారు. అయితే దానికి నిరాకరించిన అతడు రుజువు కోసం ఫోటోలు పంపాడు.

 

అయితే తన ఫిర్యాదుపై క్యాడ్‌బరీ సంస్థ స్పందించకపోవడంతో 2016 అక్టోబర్‌ 26న బెంగళూరులోని అర్బన్‌ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. క్యాడ్‌బరీ చాక్లెట్‌ల తయారీ సంస్థ మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాణ్యతా విభాగం అధిపతితోపాటు కొనుగోలు చేసిన ఎంకే రిటైల్ బ్రాంచ్‌పై 'సేవా లోపం' కింద ఫిర్యాదు చేశాడు.50 లక్షలు పెద్ద ఎమౌంట్ అని వేరే కోర్టుకు బదిలీ చేసింది.అక్కడ తన వాదనకు ప్రతి ఫలం దక్కింది..ఆరేళ్ళ పాటు సాగిన ఈ విచారణ ఈ మధ్య ఓ కొలిక్కి రావడం తో ఊపిరి పీల్చుకున్నాడు.. అందుకే ఏదైనా తిండి కనిపిస్తే ఆవురావురుమంటూ తినడం కాదు ముందు ఎలా ఉంది చెక్ చేసి తినాలి.లేకుంటే మాత్రం మన ఆరొగ్యాన్ని మనం నాశనం చేసుకున్న వాళ్ళము అవుతాము..


మరింత సమాచారం తెలుసుకోండి: