ఇటీవల కాలంలో ఎంతోమంది రిపోర్టర్స్ లైవ్ లో రిపోర్టింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడైనా ఏదైనా న్యూస్ కవర్ చేయాల్సి ఉంటే అక్కడికి పరుగున వెళ్లి  ఇక లైవ్ న్యూస్ కవర్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా న్యూస్ కవర్ చేస్తున్న రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. చుట్టుపక్కల ఉన్న జనాలు కెమెరా మొత్తం కవర్ చేసి ఇక రిపోర్టర్ కనిపించకుండా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు కొన్ని కొన్ని సార్లు రిపోర్టర్లు అక్కడ ఉన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటివి చూస్తూ ఉంటాం.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ మహిళా రిపోర్టర్ లైవ్ న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఆమె ముందు నిలబడి ఒక కుర్రాడు ఇక తన స్నేహితుల అక్కడికి రమ్మని పిలుస్తున్నాడు. అయితే కెమెరా ముందు చేతులు అటు ఇటు ఆడిస్తూ ఉండటంతో కాసేపటి వరకు ఓపికగా ఉన్న సదరు మహిళా రిపోర్టర్ తర్వాత ఆగ్రహం తో ఊగిపోయింది. ఈ క్రమంలోనే మాటలతో సరిపెట్టడం కాదు చేతికి పని చెప్పింది. తన ముందు ఉన్న కుర్రాడి చెంప చెల్లుమనిపించింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈద్ అల్ అధాను పురస్కరించుకొని పాకిస్తాన్లో ఈనెల 9వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా పండుగను ఎలా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు విషయం తెలిపేందుకు లైవ్ లో రిపోర్ట్ చేసేందుకు వెళ్ళింది ఒక యువతి. అక్కడున్న స్థానికులు ఆమె చేరిపోయారూ. ఈ క్రమంలోనే రిపోర్టింగ్ చేస్తూనే ఒక్కసారిగా బాలుడు చెంప చెల్లుమనిపించింది. కెమెరాకు బాలుడు చేయి అడ్డు పెట్టడంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: