సాధారణంగా పోలీసులు అంటే ఎప్పుడు కాస్త గంభీరంగానే కనిపిస్తూ ఉంటారు . లోపల ఎంత బాధ ఉన్నా ఎంత సంతోషం ఉన్న దాన్ని బయటికి హావభావాల ద్వారా వ్యక్తం చేయరు
 అందుకే పోలీసులను చూస్తే జనాలు కాస్త భయపడిపోతుంటారు. ఇక ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా అందరి లాగా ఫుల్గా ఎంజాయ్ చేయడం లాంటివి చేయరు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తాము ఒక పోలీస్ అధికారి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు.  కానీ ఇటీవలి కాలంలో మాత్రం పోలీసులు అంత గంభీరంగా ఉండటం లేదు.. ఇక అందరిలో ఒకరిగా కలిసిపోయి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


 అయితే సాధారణంగా పోలీసులు డాన్సులు చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఎస్సై, కానిస్టేబుల్ కలిసి నాగిని డాన్స్ ఇరగదీసారూ. వీరిద్దరు డాన్స్ చేసింది ఏదో ఫంక్షన్ లో యూనిఫాం లేని సమయంలో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే యూనిఫామ్ లోనే ఉన్నారు.. అంతే కాదండోయ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇలాంటి డాన్స్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్సై కానిస్టేబుల్  ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి.. ఇలాంటి నాగిని డాన్స్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.


 ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ లో పురానా పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది అనేది తెలుస్తుంది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ కలిసి నాగిని డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఒంటిపై  ఖాకీ యూనిఫాం ఉంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా డాన్స్ చేశారు. అయితే పక్కన మరికొంతమంది వారి ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొట్టడం గమనార్హం. పోలీసులు  చేసిన డాన్స్ కాస్త వివాదాస్పదంగా మారిపోయింది. దీంతో ఉన్నతాధికారులు వారిని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: