కొన్నిసార్లు ఇక డోర్ దగ్గర నుంచి కాకుండా కిటికీలోనుంచి రైల్లోకి ఎక్కడం లాంటివి కూడా ఎన్నో సార్లు చూశాము. అయితే ఇలాంటివి చేసి చివరికి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ వుంటారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక మహిళ ఏకంగా రైల్లోకి వెళ్లేందుకు కాదు రైలు పైన ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఆమెకు ఎక్కడానికి సాధ్యం కావడం లేదు. పైన ఉన్న వాళ్ళు సదరు మహిళకు సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు. కాని అంతలో ఊహించని ట్విస్ట్. పోలీస్ అక్కడికి రావడంతో మహిళ ఒక్కసారిగా రైలు నుంచి కిందకు దూకి పారిపోయింది.
అయితే అదే రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి వచ్చిన మరో ప్రయాణికుడు మహిళ రైలు ఎక్కుతూ ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇదంతా ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రైలు మీద ఉన్న పేరు ఆధారంగా బంగ్లాదేశ్ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. పాపం సదరు మహిళ పోలీసు రాకపోయి ఉంటే హాయిగా రైలు పైనకు ఎక్కేది కదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి