సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ కి సంబంధించిన వీడియోలు ఏవైనా సోషల్ మీడియాలో కి వచ్చాయి అంటే చాలు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలా వెలుగులోకి వచ్చిన వీడియోలలో  కొన్ని అందరికీ భయపడుతూ ఉంటే మరికొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రకృతిలో ఉండే జీవాలు ఒకదానికి ఒకటి ఎప్పుడూ సంబంధం కలిగి ఉంటాయి అన్న విషయాన్ని తెలిసిందే. ఇలాంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇలా జంతువులకి  సంబంధించిన వీడియోలు ని చూసినప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక పెంపుడు కుక్క సముద్రంలో ఉన్న సీల్ తో సరదాగా ఆడుకుంది. పెంపుడు కుక్క సీల్ తో ఆడుకోవడం ఏంటి.. కుక్క భూమి మీద ఉంటుంది.. సీల్ సముద్రంలో ఉంటుంది. ఈ రెండూ కలిసి ఆడుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క తో కలిసి బీచ్ కి వెళ్తాడు.



 అక్కడ  కుక్క తో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు సదరు వ్యక్తి. బంతిని సముద్రంలోకి విసరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిన కుక్క దాన్ని  తెచ్చి యజమాని చేతిలో పెడుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి బంతిని విసరగానే సముద్రంలో ఉన్న సీల్ కూడా కుక్క తో పోటీ పడేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే వ్యక్తి బంతిని సముద్రంలోకి విసిరిన సమయంలో కుక్క బంతి కోసం పరిగెత్తుతూ ఉండగా.. కుక్కను అనుకరిస్తూ సీల్ కూడా వేగంగా పరిగెత్తటం లాంటివి చేసింది అని చెప్పాలి.  ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు అందరూ కూడా వావ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: