ఇప్పటివరకు దొంగలు భారీగా దోచుకోవడం మాత్రమే చూసాము. కానీ కొంతమంది దొంగలు వ్యవహరించే తీరు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది బ్యాంకు చోరీలకు వెళ్ళినప్పుడు తమ దగ్గర ఉన్న మారణాయుధాలతో బెదిరించి చివరికి అక్కడ ఉన్న క్యాష్ కౌంటర్ మొత్తం కొల్లగొడుతూ ఉంటారు దొంగలు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాలు విసురుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతుంది.
వైరల్ గా మారిపోయిన వీడియోలో చేసుకుంటే కొంతమంది దొంగలు తుపాకీ పట్టుకొని బ్యాంకులో దోపిడీ చేయడానికి వచ్చారు. డబ్బు నగలు కాకుండా ఇంటర్నెట్ రూటర్, మొబైల్ ని తీసుకోవడం కనిపిస్తుంది. బ్యాంక్ లో ఉద్యోగులు పనిచేసుకునే సమయంలో ఇంటర్నెట్ రూటర్, మొబైల్స్ లాక్కుని పారిపోతున్న దృశ్యం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ దొంగతనం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు.