సాధారణంగా మనకి పాములంటే చచ్చేంత  భయం.  కానీ ఎందుకో అందరి ముందు మాత్రం పామంటే అసలు భయమే లేనట్లు కాస్త పోజులు కొడుతూ ఉంటారు. కొంతమంది తమలో ఉన్న భయాన్ని బయటపెడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక తాము నివసించే ప్రాంతంలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరు హడలిపోతూ ఉంటారు. అక్కడ ఉన్నది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకో భయం మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు ఇలా ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో పాము కనిపిస్తే దానిని కొట్టి చంపడం లాంటివి చేసేవారు. ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది పాములను కొట్టి చంపడం లాంటివి మానుకున్నారు అని చెప్పాలి.


 ఎక్కడైనా పరిసర ప్రాంతాలలో పాము కనిపించిందంటే చాలు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేయడం ఇక అతను వచ్చి ఎంతో చాకచక్యంగా పాములను పట్టుకుని వాటిని అడవిలో వదిలివేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇలా పాములు పట్టడం కూడా ఒక పెద్ద బిజినెస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా పాములు పట్టడం లాంటి వీడియోలు ఇప్పటివరకు చాలానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 విషపూరితమైన పావులను సైతం ఎంతో అలగోకగా పట్టేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక రాట్ స్నేక్ ఏకంగా స్నేక్ క్యాచర్ కే చుక్కలు చూపించింది.  ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. కర్ణాటక కు చెందిన రజాక్ షా అనే స్నేక్ క్యాచర్ కు ఓ ఇంట్లో పాము ఉందని సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే సామాన్ల కింద నక్కీ ఉన్న పామును చూస్తాడు. ఇక వస్తువులన్నింటినీ తొలగించి పామును పట్టుకుంటాడు. ఆ పాము పేరు రాట్ స్నేక్. మనం అందరం జర్రిపోతూ అని వాడుక భాషలో అంటుంటాం. అయితే పామును పట్టుకునేందుకు ప్రయత్నించిన సదరు వ్యక్తికి ఆ పాము చుక్కలు చూపిస్తుంది. చివరికి ఎంతో కష్టపడి దానిని సంచిలో బంధిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: