ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఎంతో మంది యువతీ యువకులు ఇక తమ పెళ్లిని ఎంతో గ్రాండ్గా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ఇక ఎన్నో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఒకప్పుడు కేవలం తలదించుకొని నడుచుకుంటూ వచ్చి పెళ్లి మండపంలో కూర్చున్న పెళ్ళికూతురులు మాత్రం ఇప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు.


 ఇలా డాన్సులు చేస్తూ పెళ్లిని తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా అటు దేశీయ పెళ్లిలలో సంగీత్ భారత్ వేడుకలలో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. ఒక పెళ్లి కూతురు చేసిన క్రేజీ డాన్స్ కు ప్రస్తుతం నేటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు.  ప్రస్తుత పెళ్లి దుస్తువుల్లో పూర్తిగా నగలతో అలంకరించుకొని ఉన్న పెళ్లికూతురు కట్టుబొట్టు కాస్తయినా చెరగకుండా అద్భుతమైన డాన్స్ చేసింది.


 హతీందర్ సింగ్ అనే నెటిజన్ ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు అని చెప్పాలి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే.. యువ జంట కామ్ డౌన్ సాంగ్కు డాన్స్ చేశారు.  అయితే పెళ్లికొడుకు డాన్స్ చేయడానికి కాస్త సిగ్గుపడితే అటు పెళ్లికూతురు మాత్రం డాన్స్ ఇరగదీసింది అని చెప్పాలి. ఒకవైపు అతిథులు అందరూ కూడా చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సాహిస్తూ ఉంటే.. ఏకంగా బ్రేక్ డాన్స్ కు మించిన పర్ఫామెన్స్ చేసింది పెళ్లికూతురు. కట్టుబొట్టు ఏమాత్రం చెదరకుండా డాన్స్ తో అందరిని ఫిదా చేసేసింది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన నేటిజన్స్ మహిళలు అందరూ తమ పెళ్లి వేడుకను ఇలాగే ఎంజాయ్ చేయాలని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: