సోషల్ మీడియా అనేది నేటి రోజుల్లో ఎన్నో వింతలు విశేషాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయాలన్నీ కూడా ఇక ప్రతిరోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జంతువులు పక్షులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.



 ముఖ్యం గా అడవుల్లో ఉండే జంతువులు పక్షులు వాటి జీవన శైలి ఎలా ఉంటుంది ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి అన్న విషయాలను ఎంతోమంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇక వీటిని చూసి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడానికి అటు నేటిజన్స్ కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే మనుషుల్లో సూపర్ టాలెంట్ ఉన్నవాళ్లు కొంతమంది ఉన్నట్లుగానే అటు జంతువులు, పక్షుల్లో కూడా అల్టిమేట్ టాలెంట్ ఉన్న కొన్ని జీవులు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటాయి.


 ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా పావురాలు ఎక్కడికి వెళ్లినా గుంపుగా వెళుతూ ఉంటాయి. అందుకే పావురాలను ఎక్కడ చూసినా ఇలా గుంపుగానే అందరూ చూసి ఉంటారు. ఇక్కడ ఒక పావురాల గుంపు కనిపిస్తుంది. అయితే ఈ పావురాల గుంపులో సూపర్ టాలెంట్ పావురం కూడా ఒకటి ఉంది. ఏకంగా మనుషుల లాగానే.. స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న పావురం లాగా ఆ పక్షి బ్యాక్ ఫ్లిప్స్ వేస్తుంది. అది కూడా ఆగకుండా వెంట వెంటనే. ఇలాంటి బ్యాక్ ఫ్లిప్స్ వేస్తూ ఉండడం గమనార్హం. ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: