జంతువులన్నీ కలిసి మనుషులపై పగబట్టాయా.. మనుషుల ప్రాణాలను తీయడమే టార్గెట్గా పెట్టుకున్నాయా.. హత్య చేయడానికి సుపారి తీసుకున్న గుండాల్లాగా దారుణంగా మనుషులపై దాడి చేస్తున్నాయా అంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు అడవుల్లో నుంచి చిరుత పులులు జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలు వెలుగు చూశాయి. ఇక ఆ తర్వాత అడవుల్లో ఉండే కోతులు జనావాసాల్లో స్వైర విహారంచేసి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.


 ఇక మొన్నటికి మొన్న కుక్కలు స్వైర విహారం చేస్తూ కంటికి కనిపించిన  అందరిపై కూడా దాడి చేస్తూ వచ్చాయి. ఇక ఎంతో మంది చిన్నారుల ప్రాణం కూడా తీసాయ్. అయితే ఇక ఇప్పుడు వీటన్నింటి వంతు అయిపోయింది అన్నట్లుగా పందులు కూడా మనుషులపై దాడి చేయడం మొదలుపెట్టాయి. దారుణంగా మీదపడి మరి అటాక్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల మహారాష్ట్రలోని గొండ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక భారీ పంది రెచ్చిపోయింది. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులపై సడన్గా అటాక్ చేసింది. బాలుడిని తీవ్రంగా గాయపరిచింది అని చెప్పాలి. అయితే వెంటనే స్థానికుల అప్రమత్తమై ఆ పందిని తరిమి కొట్టారు. లేదంటే ఆ బాలుడి ప్రాణాలు పోయేవే.



 అయితే ఇలా బాలుడు పై దాడి చేసేందుకు ఆ పంది ఎంత వేగంగా దూసుకు వచ్చింది అంటే పక్కనే ఉన్న మిగతా ఇద్దరు పిల్లలు ఆ పంది దాటికి రోడ్డుపై దూరంగా పడిపోయారు అని చెప్పాలి. ఇక తర్వాత భయంతో అక్కడి నుంచి పారిపోయారు మిగతా ఇద్దరు చిన్నారులు. ఇక పంది దాడి చేస్తుండడంతో  చిన్నారి కేకలు వేయగా.. అది విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి వచ్చి పందిని తరిమి కొట్టడంతో అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేకుండానే బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: