ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అసలు వాతావరణం అంటే ఏంటో అర్థం కాకుండా ఉంటోంది .సీజన్ కు సంబంధం లేకుండా వర్షం పడుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. ఇప్పుడు ఎండాకాలం కావడం చేత వర్షం పడుతూ ఉండడంతో కాస్త చల్లదనాన్ని కోరుకుంటున్నారు నగరి ప్రజలు. ఇక వేడితో అల్లాడుతున్న జనాలు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఎండలతో ఉడికిపోతున్న ప్రజలకు మళ్లీ చల్లని కబురు తీసుకువచ్చింది వాతావరణ శాఖ.



నిన్నటి రోజు నుంచి ఎక్కువగా వర్షాలు పడుతూ ఉండడంతో ఈరోజు తెల్లవారుజామున కూడా పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో నగరం అంతట ఉరుములు, మెరుపులతో కూడిన వానలు రావడంతో ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులో పలు నగరాలలో భారీగా వర్షం పడుతోంది. వర్షంతో రోడ్లన్నీ తడిసి ముద్దవ్వడంతో పలుచోట్ల రోడ్డుపైన నీళ్లు నిలవడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు. గడిచిన కొన్ని నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భారీగా మండుతున్నాయి దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఈ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తీవ్రమైన వేడితో జనాలు ఇబ్బంది పడుతున్న సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఎండ తీవ్రత చాలా తగ్గిపోయి కాస్త ఉపశమనం లభిస్తోంది. పలు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఈ మేరకు నిన్నటి రోజున కూడా తెలియజేసింది. నేటి నుంచి 16వ తేదీ వరకు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉందని తెలియజేశారు అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తారు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్నటి రోజున వర్షం అత్యధికంగా నిజామాబాదులో భీమ్గల్లో 7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది అతి తక్కువగా అదిలాబాదులో 2 మిల్లీమీటర్లు నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: