యుద్దానికైనా కయ్యానికైనా సమఉజ్జీ ఉండాలి అనేది ఒక సామెత. ఒకవేళ ఇలాంటి తమ వుజ్జి  లేదు అంటే నల్లేరు పై నడిచినట్లే అవుతూ ఉంటుంది పరిస్థితి. అయితే చిన్న జంతువులపై ఇక ఎన్నో పెద్ద జంతువులు ఆదిపత్యం చెలాయించాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. చిన్న జంతువులు అని తక్కువ అంచనా వేసిన జంతువులే.. చివరికి భంగపాటుకు గురవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక మొసలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. సాధారణంగా మొసలి ఎంత ప్రమాదకరమైన జీవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఒక్కసారి ముసలి నోటికి ఏదైనా జీవి చిక్కింది అంటే ఇక ఆ జీవి ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆ జీవిని తనకు ఆహారంగా మార్చుకుంటుంది మొసలి. ఏకంగా భారీ ఆకారమున్న జంతువులను సైతం ఎంతో అలవోకగా వేటాడుతూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక అడవి దున్న మొసలికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అడవి దున్నల గుంపు ఒక కొలనులో  నీళ్లు తాగడానికి వచ్చాయి. అయితే ఆ నీళ్ల మాటన మొసలి ఆహారం కోసం వేచి చూస్తుంది అని అవి ఊహించలేకపోయాయ్.


 ఈ క్రమంలోనే కొలనులో అటు గేదల గుంపు నీళ్లు తాగుతున్న సమయంలో ఒక్కసారిగా నీటి అడుగు నుంచి దూసుకు వచ్చిన మొసలి ఒక గేదె పైన దాడి చేసింది. ఏకంగా గేదెను తన నోటితో కరుచుకుంది మొసలి. ఈ క్రమంలోనే రెండిటి మధ్య ఆదిపత్య పోరు జరిగింది అని చెప్పాలి. అయితే మొసలి నుంచి విడిపించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది గేదె. మరోవైపు మొసలి కూడా గట్టిగా పట్టుకుని గేదెను నీటిలోకి లాక్కెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది. ఇక గేదె తనలోని శక్తినంత బయటకు తీసి మొసలిని గట్టుకు లాక్కొస్తుంది. దీంతో భయపడిపోయిన మొసలి పట్టు విడిచి మళ్లీ నీళ్లలోకి పారిపోతుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: