ఇప్పటికే దాదాపుగా రెండు వేల రూపాయల గ్రామాలలో సర్వే పూర్తి అయినందువల్ల నూతన నెంబర్లతో రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు.. దశాబ్ద కాలం నాటి సర్వే నెంబర్లు ఇంకా భూముల రికార్డులను సైతం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉండడం వల్ల ఒకే సర్వే నెంబర్లు రెండు నుంచి పది కన్నా ఎక్కువమంది భూయజమానులు ఉన్నట్లుగా అధికారుల సైతం గుర్తించడం జరిగింది. వీటితోపాటు భూయాజమాన్యాల మధ్య సమస్యలు వివాదాలు తలెత్తుతున్నట్లుగా తెలియజేశారు.
ప్రస్తుతం రిసర్వేలతో ఇలాంటి వివాదాలకు పరిష్కారం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రతి భూయజమానికి ప్రత్యేకమైన ల్యాండ్ పార్సల్ నెంబర్ తో పాటు ఆధార్ తరహాలో ఐడి నెంబర్ కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 90 లక్షల మంది భూ యజమానులు ఉన్నట్లుగా గుర్తించారు.భూయజమానిల పేరిట..2.26 కోట్ల ఎకరాల భూమి.. అలాగే 1.96 సర్వే నెంబర్లు రికార్డులో ఉన్నట్లుగా గుర్తించారు. భూసర్వే చేపట్టిన ప్రతి గ్రామంలో కూడా ఎల్ పిఎం నెంబర్, భూ ఆధార్ పేరుతో ప్రత్యేకంగా గుర్తింపు సంఖ్య జియో ట్యాగ్ తో ఇవ్వబడుతుందట. గ్రామాలలో సర్వే పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఇవ్వబోతున్నారట. ఇందులో ఎల్పిఎం నెంబర్ యజమాని ఫోటో క్యూఆర్ కోడ్ కూడా వస్తుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి