ప్రస్తుతం చలికాలం. ఎక్కడ చూసినా ఎముకలు కోరికే చలి ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతుంది. ఇలాంటి సమయంలో ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. అయితే కేవలం జనాలు మాత్రమే కాదండోయ్ కొన్ని కొన్ని పాములు కూడా చల్లదనం నుంచి తప్పించుకోవడానికి వేడి కోసం వేగంగా ఇళ్లల్లోకి వస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 అయితే ఇక ఇలా ఇళ్లల్లోకి పాములు వచ్చిన ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వీడియోలు కూడా ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇలా ఇళ్లల్లోకి పాములు వచ్చాయి అంటే చాలు.. వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించడం.. ఇక అతను వచ్చి పాములను పట్టుకుని అడవిలో వదిలేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా పాములను పట్టుకోవడానికి కొంతమంది స్నేక్ క్యాచర్లకు.. ఇలా ఇంట్లోకి దూరిన పాములు ఏకంగా చుక్కలు చూపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇలా పాములు పట్టుకోవడానికి వచ్చిన వారిని బెంబలితిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఏకంగా ఒక కొండచిలువ ఇంట్లోకి దూరింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచ్ కు సమాచారం అందించారు. అయితే అతను వచ్చి ఆ కొండచిలుకను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఏకంగా అతనిని ముప్పుతిప్పులు పెట్టింది. ఆ పాము ఏకంగా అతడి పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక ఎంతో కష్టపడి కొండచిలువను కిందికి లాగిన అతను బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల పట్టుకున్న ఈ కొండచిలువ దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుందని సదరు స్నేక్ క్యాచర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: