తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో జరగబోతున్న మూడవ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30వ తేదీన గురువారం రోజున ఓకే సారి 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మూడవ తేదీన ఆదివారం రోజున కౌంటింగ్ ప్రారంభించబోతున్నట్లు ఆరోజు ఫలితాలు కూడా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.. గత ఎన్నికలు 2019 జనవరి 15వ తేదీన ప్రారంభం అయ్యాయి.. దీని ప్రకారం 2024 జనవరి 16వ తేదీన అసెంబ్లీ గడువు ముగియనుంది.. కానీ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.



తెలంగాణలో అక్టోబర్ 9వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ మూడో తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అలా నోటిఫికేషన్ విడుదలైన కొద్దిసేపటికి నామినేషన్ల ప్రక్రియ కూడా శరవేగంగా ప్రారంభించారు. నవంబర్ 13వ తేదీ వరకు ఈ నామినేషన్లు పరిశీలన చేపట్టారు. నవంబర్ 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది దీంతో నవంబర్ 28 వరకు సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలు ఓటింగ్ వినియోగించుకోవలసి ఉంటుంది.


రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 35,356 పోలింగ్ కేంద్రాలలో తెలంగాణ వాసులు తమ ఓటు హక్కును సైతం వినియోగించాలని తెలియజేస్తున్నారు. నవంబర్ 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ కొనసాగుతుందని అని తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ పలుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది .తెలంగాణ కార్మిక శాఖ పోలింగ్ తేదీ 30వ తేదీన కూడా వేతనంతో కూడిన సెలవుని సైతం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.. 1988 నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పని చేసేటువంటి కార్మికులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: