వధువు మెడలో వరుడు తాళి కట్టే ముందు 'ఆపండి' అని హీరో లేదా విలన్ లేదా ఇంకెవరైనా గట్టిగా అరచి ఫైట్స్ చెయ్యడం మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం.వరుడితో పెళ్లి తనకు ఇష్టం లేదని వేరే వ్యక్తిని ప్రేమించానని చెబుతుంటారు కొందరు పెళ్లి కూతుళ్లు.మరికొందరు అయితే ఈ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోనని తాళి కట్టే ముందు చెప్పి పెద్ద షాక్ ఇస్తారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. తాళి కట్టబోయే ముందు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కొడుక్కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది ఓ పెళ్లికూతురు.కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని హోసదుర్గ తాలూకాలోని చిక్కబ్యాలదకెరె గ్రామానికి చెందిన ఓ యువకుడికి.. ఓ యువతితో పెద్దలు పెళ్లి సంబంధం కుదుర్చారు. వీరి పెళ్లికి గురువారం నాడు (డిసెంబరు 12)న ముహుర్తంగా నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చిక్కబ్యాలదకెరెలోని భైవవేశ్వర్ కళ్యాణమండపానికి వరుడు, వధువు కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా స్నేహితులు వచ్చారు.


 బంధువుల సమక్షంలో పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు.అయితే తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకునేందుకు మాత్రం ఆ వధువు నిరాకరించింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.అయితే అక్కడ ఉన్నవారంతా ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ ఆ పెళ్లి కూతురు ఎవరి మాట వినిలేదు. ఇదంతా జరుగుతుండగానే పెళ్లి కొడుకు పెద్ద షాక్ అయ్యాడు. అంతే తాళి పట్టుకుని.. నిల్చుని చూస్తుండిపోయాడు. ఇక ఆ వధువు మొండికేయడంతో చివరకు పెళ్లి ఆగిపోయింది.ఇక వధువు తీరుపట్ల వరుడి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వధువు కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. ఇక ఈ విషయం శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్కు చేరింది.aa పెళ్లికి అయిన ఖర్చులు వధువు తరఫువారే భరించుకోవాలని పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం వల్ల ఈ గొడవ సద్దుమణిగింది. పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పవచ్చు కదా.. పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత ఇలా అందరి ముందు చెప్పడం ఏంటని నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: