సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు మీరు నమ్మలేనంత అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి షాకింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ వీడియోలో బియ్యం బస్తాలతో తయారు చేసిన అందమైన దుస్తులు ధరించిన ఒక యువతి అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఓ ఫ్యాషన్ షోలో బియ్యం బస్తాలతో తయారు చేసిన  డ్రెస్ వేసుకున్న ఆ యువతి అందరినీ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆమె లుక్ చూసి ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి దాకా మీరు ఫ్యాషన్ షోలలో చాలా రకాల డ్రెస్‌లను చూసి ఉంటారు.. కానీ ఈ డ్రెస్ అయితే చాలా విచిత్రంగా ఉంది.ఇక నెట్టింటా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువతిని ఇలాంటి వెరైటీ డ్రెస్‌ వేసుకోవటం మీరు చూస్తారు. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా వెరైటీగా  చాలా అందంగా ఉంది.ఇక ఆ డ్రెస్‌లో ఆమె లుక్ కూడా చాలా అందంగా ఉంది. మొదట్లో ఈ డ్రెస్ ని దేనితో తయారు చేశారో ముందుగా ఎవరూ గమనించలేరు… కానీ కొంచెం పరిశీలిస్తే ఈ డ్రెస్ అసలైన బియ్యపు బస్తాలతో తయారైందని మీకు అర్థమవుతుంది.


ఇక ఈ అందమైన ఫ్రాక్ బియ్యం బస్తాలతో తయారు చేశారు.. ఈ అందమైన ఫ్రాక్‌లో యువతి ఎంతో అందంగా కనిపించింది. మీరు కూడా ఈ వీడియోను చూస్తే యువతి సృజనాత్మకతను ఖచ్చితంగా ఎంతగానో అభినందిస్తారు. ఇక ఈ వీడియో ఫ్యాషన్ షో నుండి వచ్చిందని చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యాషన్ షోకు సంబంధించిన పెద్ద బ్యానర్, ఇతర ప్రేక్షకులు కూడా కనిపిస్తారు. వీడియోలో ప్రత్యేకమైన బట్టల డిజైన్, అద్భుతమైన ఆట చూస్తే ఆశ్చర్యపోతారు. ఇలాంటి సృజనాత్మకత కేవలం భారతదేశంలోనే కనిపిస్తుంది. ఇక ఫ్యాషన్‌ షోలో యువతి బియ్యం బస్తాలతో స్టిచ్‌ చేసిన బట్టల్లో కనిపించగానే..అందరూ అలా చూస్తుండిపోయారు.ఇక ఈ వైరల్ వీడియో instagram లో lionize_world_records షేర్‌ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియో క్యాప్షన్‌పై స్పందించారు. బియ్యం బస్తాలతో తయారు చేసిన డ్రెస్‌ అదుర్స్‌ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా మంచి ఆలోచన అని ఒకరు కామెంట్ చేయగా ఇది వాటర్ ప్రూఫ్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరొక వినియోగదారు ఈ దుస్తుల ధరను అడిగారు. చాలా మందికి ఈ వీడియో చాలా నచ్చి తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: