చాలా మంది మనలో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే కచ్చితంగా ట్రైన్ జర్నీని ఇష్టపడుతూ ఉంటారు. రైలు ప్రయాణం అంటే అదో రకమైన అనుభూతి అని కూడా చెప్పవచ్చు. అలా వెళ్లేటప్పుడు ఎన్నో ప్రాంతాలను కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఒక ట్రైన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అలాగే ఒక భోగి తయారు చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంది.. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం..అందుతున్న సమాచారం ప్రకారం మన దేశంలో దాదాపుగా 12 వేల కంటే ఎక్కువ ట్రైన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులకు తమ గమ్యాన్ని చేకూర్చడంలో సహాయపడుతున్నాయి. అయితే ట్రైన్ లో భోగిలలో ప్యాసింజర్ ట్రైన్ ,జనరల్ ,ఏసి, స్లీపర్, ఇతర పేర్లతో భోగిలను పిలుస్తూ ఉంటారు.. ఒక స్లీపర్ కోచ్ బోగీని తయారు చేయడానికి దాదాపుగా 1.25  కోట్ల రూపాయలు ఖర్చవుతుందట జనరల్ భోగి తయారు చేయడానికి కోటి రూపాయలు..AC కోచ్ బోగిని తయారు చేయడానికి రూ .2 కోట్లు ఖర్చు అవుతుందట. ఇక ఇంజన్ తయారు చేయడానికి రూ .20 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ట్రైన్ నడపడం మొత్తం కూడా ఇంజన్ మీదే ఆధారపడి ఉంటుంది.


ఈ లెక్కన చూసుకుంటే ఒక ట్రైన్ తయారు చేయడానికి సుమారుగా రూ .100 కంటే ఎక్కువ కోట్లు ఖర్చు అవుతుందని నివేదికలు తెలుపుతున్నాయి.. ఇటీవలే వందేమాతరం రైలు కి రూ.115 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒడిస్సాలో ప్రమాదానికి గురైన ట్రైన్ కు ఉండేటువంటి 24 బోగీలు కూడా నాశనమయ్యాయి. దీంతో దాని విలువ రూ .48 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక ట్రైన్ విలువ ఇంత అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: