బాలీవుడ్ హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా టీమ్ ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె మరింత పాపులారిటీ అందుకుంది. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారని విషయం తెగ వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు తాజాగా అనుష్క శర్మ గర్భం పై మరొక న్యూస్ ఇంటర్నెట్ను తెగ వైరల్ గా మారుతుంది వాటి గురించి చూద్దాం.


విరాట్ కోహ్లీ, అనుష్క తమ మీద వస్తున్న ఎలాంటి విషయాలను కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు.. ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెటర్ AB దివిలియర్స్ దంపతులు సైతం తమ రెండవ బిడ్డ కోసం కోహ్లీ అనుష్క శర్మ ఎదురు చూస్తున్నారని తెలియజేశారు.. ఈ విషయాన్ని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వెల్లడించారు. అయితే ఆ తర్వాత తన ప్రకటన పైన యూటర్న్ తీసుకొని తాను తప్పు సమాచారం అందించానంటూ ఒప్పుకున్నారు..దీంతో కోహ్లీ కుటుంబానికి కూడా క్రికెటర్ క్షమాపణలు చెప్పినట్టుగా తెలుస్తోంది.


అయితే ఇప్పుడు తాజాగా.. అభిషేక్ త్రిపాఠి అనే ఒక ప్రముఖ జర్నలిస్ట్ చేసిన ట్విట్ వైరల్ గా మారింది.. అదేమిటంటే అనుష్క శర్మ గర్భ సమస్యలతో ఇబ్బంది పడుతోందంటూ తెలియజేశారు.. వైద్య పరమైన సమస్యల కారణంగా వైద్యులను సంప్రదించేందుకు కోహ్లీ అనుష్క విదేశాలకు వెళ్లారంటూ కూడా తమ ట్విట్టర్ నుంచి తెలియజేశారు..ఈ వివాదం సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంకు దారితీసింది. అయితే ఇలాంటి జంట వ్యక్తిగత విషయాలను బయట పెట్టినందుకు కొంతమంది ఈ జర్నలిస్టును విమర్శిస్తూ ఉండగా మరి కొంతమంది అసలు విరాట్ , అనుష్క ను సమర్థిస్తూ ఉన్నారు.. ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం చాలా మంచిది అంటూ తెలియజేశారు. అభిమానులు అసలు ఏంటనే విషయం పైన ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయం పైన అటు అనుష్క కోహ్లీ స్పందిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: