లంబోర్గిని.. ఈ కారును పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాడుతూ ఉంటారు. ఇక కోటీశ్వరులు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇక సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా లంబోర్ఘిని కొనుగోలు చేయాలని ఒక కల ఉండడం సర్వసాధారణం. కానీ కోట్ల రూపాయలు పెట్టి ఈ కాస్లి కారును కొనుగోలు చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సర్దుకుపోతూ తమ రేంజ్ లో ఏదో ఒక కారును కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి లంబోర్ఘిని కొనుగోలు చేయాలనే ఆశ పుట్టింది. కానీ డబ్బులు లేవు. దీంతో తన దగ్గర ఉన్న మారుతి స్విఫ్ట్ కారుని లంబోర్ఘిని కారు లాగా మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు.


 ఇక తనకు నచ్చినట్టుగా మోడీఫైడ్ చేసుకున్నాడు. ఇటీవల కాలంలో మాడిఫైడ్ కార్లు కు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా మోడిఫై చేయడానికి ప్రధాన కారణం ఏదైనా ఉంది అంటే ఇతర కార్ల మీద ఉన్న ఆసక్తి అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా తన దగ్గర ఉన్న మారుతి స్విఫ్ట్ కారుని లంబోర్ఘిని తరహాలో మాడిఫై చేసేసాడు. ఏకంగా లంబోర్ఘిని కారులో కనిపించే సీజర్ టైప్ డోర్స్ ఫిక్స్ చేసుకున్నాడు. దీంతో ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. షిఫ్ట్ కార్ కి రెక్కలు వచ్చాయా ఏంటి అని అవాక్కవుతున్నారు. అయితే లంబోర్గిని కార్ తరహాలో   స్విఫ్ట్ కార్ కి డోర్స్ రీప్లేస్ చేయడానికి ఏకంగా 70 వేల రూపాయల వరకు ఖర్చయినట్లు సదరు వ్యక్తి చెప్పాడు. హర్యానాలోని గూర్కావ్ లో ఓ మోడిఫైడ్ మారుతి కార్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. కేవలం డోర్స్ మాత్రమే కాదు ఏకంగా వెనుక భాగంలో ఉన్న లైట్స్ కారు ప్రత్యేకమైన ఆకర్షణలు పొందడానికి చుట్టూ  రెయిన్బో ర్యాప్ చుట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ఎగ్జాస్ట్ కూడా మోడీపై చేసి ఉండడం గమనించవచ్చు. అయితే ఇలా మోడిఫై చేసిన డోర్లకు అలవాటు పడాలి అంటే మాత్రం దాదాపు పది నుంచి 15 రోజుల సమయం పడుతుంది అని ఇక ఈ వీడియోలో కార్ గురించి చెబుతున్న ప్రజెంటర్ చెప్పుకొచ్చాడు  ఇలా కారుని మాడిఫైడ్ చేసుకున్న తర్వాత పోలీసుల నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: