గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా బర్డ్ ఫ్లూ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో కూడా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉన్నాయి. వీటి శాంపుల్ సైతం ల్యాబ్ కు పంపించిన తర్వాత అక్కడ నిపుణులు బర్డ్ ఫ్లూ తో కోళ్లు చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం అప్రమత్తమయి పలు ప్రాంతాలలో చికెన్ షాపులను కూడా బంద్ చేయించారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు చికెన్ గుడ్లు తినవచ్చా లేదా అనేవి కన్ఫ్యూజన్లో ఉన్నారు.


వీటిని తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందా అనే భయభ్రాంతులకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లూమోంజా  ఇది కేవలం పక్షులకు మాత్రమే వ్యాపించేటువంటి వైరస్. అలాగే కోళ్లకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యాధి సోకినప్పుడు చాలామంది ప్రజలకు దగ్గు ఊపిరి తీసుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, జలుబు ,తలనొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది శరీరంలో ఏడు నుంచి 8 రోజుల వరకు ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


అయితే ఈ వైరస్ కేవలం కోళ్ల ఫారాలు ఇతర పక్షులను పెంచే వారికి మాత్రమే సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే పక్షుల పైన ఏదైనా పరిశోధనలు చేసే వారికి కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి పక్షులను ముట్టుకున్నప్పటికీ వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. పావురాలకు కోళ్లకు ఆహారం వేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.. అయితే కోడిగుడ్లను చికెన్ ను కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన తర్వాతే తినడం మంచిది. ఇలా తినడం వల్ల ఎలాంటి బర్డ్ ఫ్లూ అనేది వ్యాపించదు.. బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు శుభ్రత అనేది పాటించాలి. బర్డ్ ఫ్లూ వల్ల చాలామంది భయంతో చికెన్ గుడ్లను కూడా తినడం మానేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: